ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి.. బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్ నాగబాబుకేనా..?
తెలుగు ప్రేక్షకులకు ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి పరిచయం అవసరం లేదు. కమెడియన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. పలు సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రవితేజ నటించిన ఆంజనేయులు మూవీతో నిర్మాతగా మారాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కూడా సినిమాలు నిర్మించి ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు.
పవన్ కళ్యాణ్ కి వీర భక్తుడిగా బండ్ల గణేష్ కి పేరుంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్ లలో బండ్ల పాల్గొంటూ ఇచ్చే స్పీచ్ లకి నెక్స్ట్ లెవెల్ లో అభిమానులు ఉన్నారు అనడంలో సందేహం లేదు. అలానే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు గణేష్. ముఖ్యంగా ట్విట్టర్‌లో రోజూ ఏవో ట్వీట్లు చేస్తూనే ఉంటారు. బండ్ల గణేష్ గత కొంతకాలంగా సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ వాటి గురించి సామాజిక మాద్యమాల్లో స్పందిస్తూనే ఉంటున్నారు. అయితే ఇప్పుడు బండ్ల గణేష్ నాగబాబును ఉద్దేశించి ట్వీట్స్ చేసినట్టు పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

రీసెంట్ గా జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు మాట్లాడుతూ.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి రెండు కారణాలు. ఒకటి పవన్, రెండు పిఠాపురం ప్రజలు. వీరిద్దరి వలనే ఆయనకు విజయం దక్కింది. ఇవి కాకుండా పవన్ ను ఎవరైనా గెలిపించడానికి దోహదపడ్డామని వారనుకుంటే అది వారి ఖర్మ అంటూ వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్స్ పట్ల టీడీపీ నేతలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
వీటికి మరింత ఊతం ఇస్తూ.. కృతజ్ఞత లేకుండా బ్రతకడం అంటే మానవత్వాన్ని కోల్పోవడమే అని గణేష్ ట్వీట్ చేశారు. ద్రోహంతో బ్రతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే అని.. ఒక మనిషి జీవితంలో కృతజ్ఞత ఎంత ముఖ్యమో, ద్రోహం ఎంత ప్రమాదకరమో స్పష్టంగా తెలియజేస్తుందన్నారు. మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి అంటూ పోస్ట్ చేశారు. అయితే మెగా ఫ్యామిలీకి వీర విధేయుడుగా పేరున్న బండ్ల గణేష్.. ఇప్పుడు నాగబాబుకు రివర్స్ అవ్వడం ఏంటని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
“కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే,
— BANDLA GANESH. (@ganeshbandla) March 15, 2025
ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే.”
ఒక మనిషి జీవితంలో కృతజ్ఞత ఎంత ముఖ్యమో, ద్రోహం ఎంత ప్రమాదకరో స్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి….!
-
హీరోయిన్ కు పవన్ కల్యాణ్ రాజకీయ ఆఫర్.. ఏం జరిగిందంటే..? -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
'బెడ్ రూమ్ లో నా భర్త చేసేది ఇదీ'.. రాజ్ నిడిమోరుపై సమంత వైరల్ పోస్ట్.. -
'జబర్దస్త్' యాంకర్ ఛాన్స్ వదులుకున్న నటి ఎవరో తెలుసా? అనసూయ స్థానంలో.. -
చిరంజీవి కూతురుగా బ్లాక్ బస్టర్ మూవీ హీరోయిన్.. ఎవరంటే..? -
టాలీవుడ్ హీరోకు షాక్ .. 'పెళ్లయిన 3 రోజులకే భార్య వదిలేసి వెళ్లిపోయింది'..! -
Tollywood: డబ్బులు ఇవ్వకుండా పారిపోయిన నిర్మాత -
ఓటీటీలోనూ బ్లాక్ బస్టర్.. ఈ సినిమా చూసి ప్రభాస్ ఫిదా..!! -
సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని.. 40 ఏళ్ల వ్యక్తిని 20 ఏళ్ల అమ్మాయి ప్రేమిస్తే ?? -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications