పెళ్లైన రెండు నెలలకే తల్లైనా స్టార్ హీరోయిన్
హీరోయిన్ అమలాపాల్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాను తల్లి కాబోతున్నట్టు ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా తెలియజేసింది. 1+1=3 అంటూ అమలాపాల్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో రాసుకొచ్చింది. పైగా ఈ పోస్ట్‌ను తన భర్తకు ట్యాగ్ చేయడంతో పాటు, ప్రెగ్నెంట్‌కి సంబంధించిన హ్యాష్ ట్యాగ్‌లను కూడా తన పోస్టుకు జత చేసింది.
దీంతో అమలాపాల్ తల్లి కాబోతుందని కన్ఫార్మ్ చేసినట్టు అయింది. అమలాపాల్ వైవాహిక జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. దర్శకుడు విజయ్‌ను అమలాపాల్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత విభేదాలు తలెత్తడంతో ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నారు.

విడాకులు అనంతరం తిరిగి సినిమాల్లో నటించిన అమలాపాల్.. గతంలో కంటే హాట్‌గా కనిపించి అభిమానులను అలరించింది. జగత్ దేశాయ్ అనే ఈవెంట్ మేనేజర్‌తో కొన్నాళ్లు డేటింగ్ చేసిన అమలాపాల్ ఇతనే నా ప్రియుడు అంటూ అభిమానులకు పరిచియం చేసింది.
అక్టోబర్ 26న ప్రియుడు జగత్ దేశాయ్‌ను పరిచియం చేసిన అమలాపాల్ ..సరిగ్గా పది రోజుల్లోనే అతన్ని పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చింది. అమలాపాల్ ఇంత సడన్‌గా పెళ్లి చేసుకోవడంపై అప్పట్లోనే నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.

అమలాపాల్ ఇంత త్వరగా పెళ్లి చేసుకోవడానికి కారణం ఆమె ప్రెగ్నెంట్ అయిందని అందుకే ఆమె త్వరగా పెళ్లి చేసుకుందని నెటిజన్లు కామెంట్ చేశారు. పైగా అమలాపాల్ బాడీలో కూడా చాలా మార్పులు కనిపిస్తున్నాయని..అందుకే అమలాపాల్ రాత్రికి రాత్రే పెళ్లి చేసుకుందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆమెను ట్రోల్ చేశారు.
ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ అమలాపాల్ తాను తల్లి కాబోతున్నట్టు ప్రకటించారు. దీంతో గతంలో అమలాపాల్ విషయంలో నెటిజన్లు స్పందించిందే నిజమైనట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ తల్లి కాబోతుండటంతో అమలాపాల్‌కు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.












Click it and Unblock the Notifications