అలా చచ్చిపోవాలని ఉంది.. అదే చివరి సినిమా - అమీర్ ఖాన్
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం భాషలతో పాటు దక్షిణాదిలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విభిన్న కథలు, విభిన్న పాత్రలతో ఆడియన్స్ ని అలరిస్తూ ఉంటారు. ప్రస్తుతం " సీతారే జమీన్ పర్ " అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తన నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇక అమీర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం గురించి ఇప్పటికే పలు విషయాలను పంచుకున్నారు. అయితే ఈ క్రమంలోనే అదే తన చివరి సినిమా కావచ్చంటూ షాకింగ్ కామెంట్స్ చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అమీర్ ఏమన్నారంటే..
మహాభారతం అనేది తన చిన్నప్పటి కల అని చెప్పుకొచ్చారు. మహాభారతంలో ప్రపంచంలో ఉన్న అన్ని భావోద్వేగాలు ఉంటాయని.. అందుకే దాన్ని ఒక గొప్ప సినిమాగా చూపించాలని కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. అలాంటి గొప్ప సినిమా తన సినీ కెరియర్ లోనే ఆఖరి చిత్రం కావచ్చని కూడా అమీర్ ఖాన్ తెలియజేశారు. ఎందుకంటే అంతటి గొప్ప సినిమా చేసిన తర్వాత ఎలాంటి సినిమా చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంటుందని వెవెల్లడించారు. అంతే కాకుండా అలాంటి గొప్ప సినిమా చేస్తూ చనిపోవాలని ఉందని అమీర్ ఖాన్ తెలిపారు.
అమీర్ ఖాన్ మహాభారతం సినిమాలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు హీరోలు కూడా నటించబోతున్నారంటూ ప్రచారం నడుస్తోంది. మరోవైపు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి కూడా మహాభారతం సినిమా చేయటమే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పలు సందర్భాలలో వెల్లడించారు. దీంతో వీరిద్దరిలో ఎవరు ముందుగా ఆ ప్రాజెక్ట్ చేస్తారో అని చర్చ నడుస్తోంది.












Click it and Unblock the Notifications