అమితాబ్ బచ్చన్ ఆస్తుల విలువ తెలుసా?

భారతదేశ సినీ పరిశ్రమలో బిగ్ బి అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు అమితాబ్ బచ్చన్. బాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. అందులో కొందరు పరిశ్రమపై చెరగని ముద్ర వేశారు. అభిమానుల గుండెల్లో కొలువై ఉన్నారు. అలా ఎప్పటికీ చెరగని ఓ స్థానాన్ని అమితాబ్ సంపాదించుకున్నారు. పలు సినిమాల్లో ఇప్పటికీ కీలక పాత్రలు పోషిస్తూ తన నటనను కొనసాగించడమేకాదు.. ఎన్నో వాణిజ్య ప్రకటనలు కూడా చేస్తున్నారు. సినీ పరిశ్రమకు అమితాబ్ వచ్చి కొన్ని దశాబ్దాలు దాటింది. ఈ తరుణంలోనే ఆయనకు సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది.

సినిమాలు, వాణిజ్య ప్రకటనలద్వారా రెండు చేతులా సంపాదిస్తున్న అమితాబ్ ఆస్తుల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు.. ఆయన సతీమణి జయాబచ్చన్ బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలు కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీ తరఫున ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆమె రాజ్యసభకు ఐదోసారి ఎంపికయ్యారు. అఫిడవిట్ లో తన వ్యక్తిగత సంపాదన వివరాలను వెల్లడించారు.

amitabh bachchan property value

బ్యాంక్ బ్యాలెన్స్ 10.11 కోట్లు కాగా, అమితాబ్ బచ్చన్ బ్యాంక్ బ్యాలెన్స్ 120 కోట్లుగా ఉంది. కేవలం బ్యాంకులో ఉండే సొమ్ము మాత్రమే ఇది. జయాబచ్చన్ - అమితాబ్ బచ్చన్ కి సంబంధించిన ఆస్తుల విలువ మొత్తం రూ.170 కోట్లకు పైగా ఉంటుంది. 2018లో వీరి ఆస్తి విలువ వెయ్యి కోట్లు గా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఐదు సంవత్సరాల్లో రూ.500 కోట్లు పెరిగిందంటున్నారు. మరోవైపు ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్ కూడా సినీ పరిశ్రమలోనే ఉన్నారు. అంతేకాదు.. వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. ఈ లెక్కన వారి ఆస్తుల విలువ రూ.2వేల కోట్లు ఉంటుందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+