దర్శకుడితో యంగ్ హీరోయిన్ అలా ..వీడియో వైరల్
హీరోయిన్ల తమ కెరీర్‌తో లైఫ్ కూడా సెటిల్ అయ్యేలా ప్రణాళికలు చేసుకుంటున్నారు. మెజార్టీ హీరోయిన్లు కెరీర్ చివరి దశలో ఉన్నప్పుడు వివాహం చేసుకుంటారు. అది కూడా బాగా సెటిల్ అయిన బిజినెస్ మ్యాన్‌ని వివాహం చేసుకుని లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. మరికొందరు హీరోయిన్లు హీరోలను ప్రేమించి వారిని వివాహం చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఓ యంగ్ హీరోయిన్ ఓ దర్శకుడుతో ప్రేమలో పడ్డట్టు కన్ఫర్మ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు అమ్ము అభిరామి.
తమిళ రాక్షసన్ సినిమాలో బాల నటిగా నటించిన ఈ అమ్మడు అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఓ పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూనే మరో పక్క హీరోయిన్‌గా కూడా నటిస్తోంది ఈ భామ. తెలుగులో కూడా నారప్ప, ఎఫ్‌సీయూకే, రణస్థలి, డెవిల్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. అమ్ము అభిరామి తమిళ దర్శకుడు పార్థివ్ మణితో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని ఆమె తెలియజేసింది.

గతంలో ఓసారి ప్రేమ విషయాన్ని చూచాయిగా బయటపెట్టింది.కానీ ఇప్పుడు అతడి పుట్టినరోజున వీడియో పోస్ట్ చేసి.నా జీవితంలో వచ్చినందుకు థ్యాంక్స్ అని రాసుకొచ్చింది.ఈ అమ్మడు పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు కొందరు కంగ్రాట్స్ చెబుతుంటే మరికొందరు మాత్రం పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే ఇన్నాళ్లు సీక్రెట్‌గా రిలేషన్‌షిప్ మెయింటేన్ చేసిన అమ్ము అభిరామి ఇప్పుడు బయటపెట్టడంతో.. తొందరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అందుకే అధికారికంగా పెట్టిందని అంతా అనుకుంటున్నారు. ప్రస్తుతం అమ్ము అభిరామి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications