Anaganaga Oka Raju: OTT లోకి అనగనగా ఒక రాజు, రిలీజ్ డేట్ ఇదే
ఈ ఏడాది సంక్రాంతి బరిలో థియేటర్లను నవ్వులతో నింపిన సినిమాల్లో ఒకటి 'అనగనగా ఒక రాజు'. కుటుంబంతో కలిసి చూసే ఫీల్, గోదావరి అందాలు, నవీన్ పొలిశెట్టి టైమింగ్..వ ఇవన్నీ కలిసొచ్చిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. థియేటర్‌లో మిస్ అయినవాళ్లకు, మళ్లీ నవ్వాలనుకునేవాళ్లకు ఇదే గుడ్ న్యూస్!
OTT రిలీజ్ డేట్ ఖరారు
ఈ నెల 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో 'అనగనగా ఒక రాజు' స్ట్రీమింగ్ కానుంది. పండగ సీజన్‌లో థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా, ఇప్పుడు ఇంట్లో కూర్చొని చూసే సరదా ఇవ్వబోతోంది.

గోదావరి బ్యాక్‌డ్రాప్ + పక్కా ఎంటర్‌టైన్‌మెంట్
గోదావరి పరిసరాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం, పక్కా పండగ సినిమా అనిపించుకుంది. హీరో నవీన్ పొలిశెట్టి తన కామెడీ టైమింగ్‌తో మరోసారి ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. ఆయన సరసన మీనాక్షి చౌదరి అందం, అభినయంతో ఆకట్టుకోగా... చమ్మక్ చంద్ర, 'సంక్రాంతికి వస్తున్నాం' ఫేమ్ బుల్లిరాజు, రావు రమేశ్ వంటి వారు తమదైన శైలిలో నవ్వులు పంచారు. దర్శకుడు మారి ఈ సినిమాను లైట్ హార్ట్‌డ్ ఎంటర్‌టైనర్‌గా మలిచారు.
జనవరి 14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో... హీరో నవీన్‌కు ప్రొడ్యూసర్ నవీన్ ఎర్నేని ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. తమ కాంబినేషన్‌లో మరో సినిమా కోసం ఎదురుచూస్తున్నానని కూడా వెల్లడించారు.
కథలోకి వెళ్తే...
గౌరవపురం జమీందార్ గోపరాజు మనవడు రాజు (నవీన్ పొలిశెట్టి). పేరు తప్ప ఆస్తి లేక, ఆర్థిక కష్టాలతో రోజులు గడుపుతూ... పగటి కలలతో బ్రతుకుతుంటాడు. "డబ్బున్న ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితంలో సెటిల్ అవుతా" అన్న ఆశతో ముందుకెళ్తాడు. అలా చారులత (మీనాక్షి చౌదరి)ని చూసిన రాజు.. ఆమె తన రాణి అయితే తన కష్టాలన్నీ తీరిపోతాయని భావిస్తాడు. ఆమె మనసు గెలవడానికి రంగంలోకి దిగుతాడు. మరి, రాజు నిజంగా చారులత హృదయం గెలిచాడా? ఆమె జీవితంలోకి వచ్చాక అతడి కష్టాలు తీరాయా? రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అన్నదే మిగతా స్టోరీ.
కామెడీ, ఎమోషన్, గోదావరి అందాలు అన్ని కలిపిన ఫన్ ప్యాక్ మూవీ. థియేటర్‌లో నవ్విన వాళ్లైనా, చూడని వాళ్లైనా... ఈ నెల 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో 'అనగనగా ఒక రాజు' మిస్ కాకండి!












Click it and Unblock the Notifications