ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న ఆనంద్ దేవరకొండ..?

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా తన వైవిధ్యమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2019 లో దొరసాని చిత్రంతో ఆనంద్ దేవరకొండ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రాన్ని కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్, బేబీ తదితర చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం తక్షకుడు, ఎపిక్ చిత్రాల్లో నటిస్తున్నాడు.

అయితే ఆనంద్ కెరీర్ లో బేబీ సినిమా చాలా ప్రత్యేకం అని చెప్పొచ్చు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసుకుంది. ఈ మూవీని సాయి రాజేశ్ దర్శకత్వం వహించాడు. రూ. 10 కోట్లతో నిర్మించిన ఈ మూవీకి ఏకంగా రూ. 80 కోట్లు కలెక్షన్స్ రావడం విశేషం. ఈ మూవీలో ఆనంద్ దేవరకొండ సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఇక బేబీ మూవీలో వీరి కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉంటుంది.

ఇక ఇటీవల విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం ఉదయ్ పూర్ లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. మార్చి 4 న వీరి రిసెప్షన్ హైదరాబాద్ లో ఘనంగా జరగనుంది. అయితే ఇప్పుడు అందరూ ఆనంద్ దేవరకొండ గురించే మాట్లాడుకుంటున్నారు. మరోవైపు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులారిటీ ని సంపాదించుకుని సినిమాల్లోకి ఎంట్రీన బ్యూటీ వైష్ణవి చైతన్య. బేబీ చిత్రంలో హీరోయిన్ గా నటించి ఓవర్ నైట్ హీరోయిన్ గా మారిపోయింది.

AnandDeverakonda Vaishnavi Chaitanya Love Rumors Go Viral on the Social Media Fans Speculate

అయితే ఈ సినిమా నుంచి ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఆమె ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన కొన్ని ఫోటోలు చూస్తే ఇది నిజమే అని స్పష్టం అవుతోంది. ఈ మేరకు వైష్ణవి చైతన్య విజయ్- రష్మిక పెళ్లిలో సందడి చేయడమే కాకుండా.. ఆనంద్ దేవరకొండతో జంటగా కలిసి విజయ్- రష్మిక జంటతో ఫోటో దిగి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. దాంతో త్వరలోనే ఈ జంట కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+