అనసూయ పెదవులపై కూడానా..!
యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనసూయ ఏం చేసిన కూడా సంచలనమే అన్నట్టుగా ఉంటుంది. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ తరువాత యాంకర్‌గా , హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది. ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే..అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అందం , అభినయం రెండు ఉన్న అనసూయకు వివాదాలు కూడా కొత్తేం కాదు. బహిరంగంగానే ముద్దులు, హగ్గులు, బికినీలతో రచ్చ చేస్తూ..ట్రోలింగ్ బారిన పడుతున్నారామె. ఇక హీరో విజయ్ దేవరకొండతో వివాదం గురించి అందరికి తెలిసిందే. తనని విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా సమాధానం కౌంటరిస్తుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ. 38 ఏళ్ల వయస్సులో కూడా సూపర్ హాట్‌గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది.

గ్లామర్‌గా కనిపించడానికి అనసూయ తెగ కష్టపడుతుంటుంది. ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. చీరకట్టినా, మోడ్రన్ డ్రెస్ వేసినా తన చూపులతోనే గుచ్చేసే అనసూయ.. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసి కుర్రాళ్ళ మతిపోగొట్టింది. అనసూయ తన లేటెస్ట్ ఫొటోలోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గతంలో ఆమె ఇంతకంటే ఘాటైన డ్రెస్సులాలో కనిపించినప్పటికీ ఈ లుక్కులో మాత్రం మరింత అందంగా కనిపిస్తోంది ఈ హ్యాట్ బ్యూటీ.
అనసూయ లేటెస్ట్ ఫొటోలపై పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంటే మరికొందరు నెగిటివ్‌గా కామెంట్ చేస్తున్నారు. అనసూయ ఈ డ్రెస్‌లో అందంగా కనిపించినప్పటికీ..ఆమె లిప్ స్టిక్ అంతగా బాగోలేదు కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. డ్రెస్ మీదకు మ్యాచ్ అయి ఉండవచ్చు కానీ..అనసూయను ఇలా చూస్తే పిల్లలు భయపడటం ఖాయమంటూ మరికొందరు నెగిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. . అయితే ఇలాంటి కామెంట్స్ ఎన్ని వచ్చినా కూడా అనసూయ వాటిని పెద్దగా పట్టించుకోదనే విషయం అందరికి తెలిసిందే.












Click it and Unblock the Notifications