అనసూయ జిమ్ వీడియో చూస్తే మెంటల్ ఎక్కాల్సిందే..!

ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుతున్నారనే విషయం అందరికి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈజీగా రీచ్ కావొచ్చనే అభిప్రాయం చాలామంది సెలబ్రిటీల్లో నెలకొంది. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారిలో యాంకర్ అనసూయ కూడా ఒకరు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ తర్వాత యాంకర్‌గా , హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది.

అనుసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టింది. ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే..అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందం , అభినయం రెండూ ఉన్న అనసూయకు వివాదాలు కూడా కొత్తేం కాదు. బహిరంగంగానే ముద్దులు, హగ్గులు, బికినీలతో రచ్చ చేస్తూ..ట్రోలింగ్ బారిన పడుతున్నారామె. ఇక హీరో విజయ్ దేవరకొండతో వివాదం గురించి అందరికి తెలిసిందే. తనని విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా సమాధానం కౌంటరిస్తుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ. అనసూయ ఏం చేసిన కూడా సంచలనమే అన్నట్టుగా ఉంటోంది.

Anasuya Bharadwaj fitness video goes viral

40 ఏళ్ల వయస్సులో కూడా సూపర్ హాట్‌గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది. గ్లామర్‌గా కనిపించడానికి అనసూయ తెగ కష్టపడుతుంటుంది. ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. ఇక సోషల్ మీడియాలో అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.తాజాగా అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది.

ఎక్స్‌సైజ్ చేస్తోన్న వీడియోను తన అధికారిక సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఈ వీడియోలో వర్కవుట్ చేస్తూ అనసూయ చెమటలు కక్కేస్తుంది. చాలా కష్టసాధ్యమైన కసరత్తులు చేస్తూ కనిపించింది. కష్టంగా ఉన్నప్పటికీ కూడా అనసూయ తన ఎక్స్‌సైజ్‌లను కొనసాగించింది. నాజుగ్గా కనిపించడానికి జిమ్‌లో అనసూయ పడుతున్న కష్టాలను చూసిన నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అనసేయ జిమ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+