బొమ్మ బ్లాక్ బస్టర్... రంగమ్మత్తను చూశారా?

యాంకర్, నటి అనసూయకు ఎంతటి క్రేజ్ ఉంటుంది అనేది మనందరికీ తెలిసిందే. బుల్లితెరపై స్టార్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న అనసూయ సినిమాల్లో కూడా మంచిపాత్రలో పోషిస్తూ అంతే పేరు తెచ్చుకుంటోంది. అనసూయవల్లే బుల్లితెరకు క్రేజ్ వచ్చిందంటే అతిశయోక్తి కాదు. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో బుల్లితెరకు దూరమవ్వాలనే నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో అనసూయ హైపర్ యాక్టివ్ గా ఉండటమేకాదు.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోలను అప్ డేట్ చేస్తుంది. తాను ఎక్కడుంది? ఏం చేస్తుంది? అనే విషయాలను వెల్లడిస్తుంటుంది.

తాజాగా షేర్ చేసిన ఫొటోలు చూసినవారంతా వావ్ అంటున్నారు. స్కై బ్లూ కలర్ గౌన్ లో మెరుపులు మెరిపించడమేకాదు.. అల్లరి చేష్టలు చేస్తూ ఇస్తున్న ఫోజులు కూడా సూపర్ అనిపిస్తున్నాయి. లంగావోణీలో యువత ఉక్కిరిబిక్కిరి అయ్యేలా ఉన్న ఈ ఫొటోలు చూసినవారి మైండ్ బ్లాకవుతోందంటే అతిశయోక్తి కాదు. తన బందువుల పెళ్లి వేడుకలో ఇలా కనిపించింది. భర్త, పిల్లలతో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

anasuya Bharadwaj public appearance in srungavarapukota

రంగస్థలం, పుష్ప, క్షణం లాంటి చిత్రాలు అనసూయకు మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. చివరగా పెదకాపు చిత్రంలో నటిచింది. రజాకార్, పుష్ప2 లాంటి సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే తన దగ్గరకు వచ్చే ప్రతి ఆఫర్ ను ఆమె ఒప్పుకోదు. పాత్ర నచ్చితేనే చేస్తుంది. తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తోంది.

anasuya Bharadwaj public appearance in srungavarapukota

అనసూయకు 38 సంవత్సరాల వయసు అంటే ఎవరూ నమ్మరు. అంత ఫిట్ నెస్ ను మెయింటైన్ చేస్తుంది. సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్ టాప్ రేంజ్ లో ఉన్న హీరోయిన్ల కూడా ఉండదు. అనసూయ చేసే ఫొటో షూట్స్ చూస్తే మాత్రం పిచ్చెక్కుతుంది. అలా చేస్తుంది. వీలు కుదిరినప్పుడల్లా భర్త, పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళుతూ వాటికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేస్తుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+