నడిరోడ్డు మీద భర్తతో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయిన అనసూయ
యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనసూయ ఏం చేసిన కూడా సంచలనమే అన్నట్టుగా ఉంటుంది. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ తరువాత యాంకర్‌గా , హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది. ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే..అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అందం , అభినయం రెండు ఉన్న అనసూయకు వివాదాలు కూడా కొత్తేం కాదు. బహిరంగంగానే ముద్దులు, హగ్గులు, బికినీలతో రచ్చ చేస్తూ..ట్రోలింగ్ బారిన పడుతున్నారామె. ఇక హీరో విజయ్ దేవరకొండతో వివాదం గురించి అందరికి తెలిసిందే. తనని విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా సమాధానం కౌంటరిస్తుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ. 38 ఏళ్ల వయస్సులో కూడా సూపర్ హాట్‌గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది. గ్లామర్‌గా కనిపించడానికి అనసూయ తెగ కష్టపడుతుంటుంది. ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే.

చీరకట్టినా, మోడ్రన్ డ్రెస్ వేసినా తన చూపులతోనే గుచ్చేస్తుంటుంది అనసూయ. తాజాగా అనసూయకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో అనసూయ తన భర్తతో కలిసి షటిల్ ఆడుతూ కనిపించారు. వర్షం పడుతున్న సమయంలో అనసూయ తన భర్త భరద్వాజ్‌తో ఈ గేమ్ ఆడారు. ఒకనొక సమయంలో తన భర్తతో చాలా క్లోజ్‌గా ఉన్న ఫొటో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోను సైతం అనసూయ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక అనసూయ కెరీర్ విషయానికి వస్తే..ఆమె ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ఫ2, పవన్ కల్యాణ్ నటిస్తోన్న హరిహర వీరమల్లు సినిమాల్లో నటిస్తున్నారు.












Click it and Unblock the Notifications