అలాంటి దుస్తులు ధరిస్తే రేప్ చేస్తారా..? అనసూయ షాకింగ్ కామెంట్స్
యాంకర్ అనసూయ మరోసారి వార్తల్లో నిలిచారు.తాజాగా తాను చేసిన ఓ పనితో ఆమె మరోసారి నెటిజన్లు టార్గెట్ అయ్యారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న వారి పేర్లలో అనసూయ కూడా ఒకరు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనుసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేంతో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
రంగస్థలం సినిమా తరువాత అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే.. ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ హ్యాట్ బ్యూటీ 38 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది.

ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. చీర కట్టిన, స్కార్ట్ వేసిన అది అనసూయకే చెల్లింది. అందం,నటనతో చాలామంది అభిమానులను సంపాధించుకున్న అనసూయ.. వివాదాలతో కూడా నిత్యం సహవాసం చేస్తూనే ఉంది.అనసూయ ఏం చేసిన, ఏం మాట్లాడిన సంచలనమే అన్నట్టుగా ఉంది పరిస్థితి. అయితే ఇదే సమయంలో అనసూయ పలు వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచారు. తాజాగా అనసూయ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది.
తన ఫ్యాన్ సోషల్ మీడియా పేజ్‌లో పెట్టిన ఓ పోస్ట్‌పై స్పందించారామె.మహిళలు ధరించే దుస్తులు వల్లనే మానభంగాలు జరుగుతున్నాయి అనే వాదనకు.. అనసూయ అభిమాని 'మన ఆలోచనలు బట్టి ఉంటుంది. స్త్రీలు ధరించే దుస్తులు బట్టి కాదు' అని పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన అనసూయ..'నన్ను అభిమానించే వాళ్లు.. ఎప్పుడూ ఎవరినీ దుర్భాషలాడలేదు, ఎవరినీ టార్గెట్ చేసుకుని విమర్శలు చేయలేదు.ఎవరినీ ఎప్పుడూ రెచ్చగొట్టలేదు లేదా అనవసరంగా ఎవరినీ అగౌరవపరచలేదు. తప్పుడు విషయాలపై దృష్టి పెట్టలేదు, ఎలాంటి బాధ్యత తీసుకోకుండా పారిపోలేదు.. కేవలం స్వచ్ఛమైన మనసుతో ఉన్నారు. నా అభిమానుల ప్రేమకు నేను గర్విస్తున్నాను అంటూ అభిమాని పెట్టిన పేజ్‌కు రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ పోస్టులో వైరల్ అవుతున్నాయి
-
మరో హిట్ సినిమాతో వస్తున్న యంగ్ హీరో..ఈసారి సైకలాజికల్ థ్రిల్లర్ మామ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!! -
అట్టర్ ఫ్లాప్ అనే టాక్‌తో మొదలై చివరకు బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఇవే -
గ్యాస్ కష్టాలు.. కట్టెల పొయ్యికి షిఫ్ట్ అయిన యంగ్ హీరో తల్లి !! -
మూవీకి నో చెప్పానని ఆ డైరెక్టర్ అలా చేశారు.. ఫుల్‌గా ఏడ్చేశా - మెగా కోడలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం.. 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ రిలీజ్.. -
ఎట్టకేలకు మనసులో మాట బయటపెట్టిన కాయదు లోహర్! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ప్రేమ్ రక్షిత్ మాస్టర్‌కు "మైఖేల్ జాక్సన్" కొరియోగ్రాఫర్ ప్రశంసలు.. -
సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న "త్రిష".."విజయ్" బాటలోనే పాలిటిక్స్ లోకి !!











Click it and Unblock the Notifications