స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో పిచ్చెక్కించిన అనసూయ

యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ తర్వాత యాంకర్‌గా అవతారం ఎత్తింది. ముఖ్యంగా జబర్థస్త్ షో ద్వారా ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ ..తద్వారా పలు సినిమాల్లో కూడా ఛాన్స్‌లు కొట్టేసింది. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ నటనకు మంచి గుర్తింపు లభించింది.

అందం, నటనతో అనసూయ చాలామంది అభిమానులను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో చెక్కు చెదరని అభిమాన గణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ హాట్ బ్యూటీ 40 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది. ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. చీరకట్టిన, మోడ్రన్ డ్రెస్ వేసిన తన చూపులతోనే గుచ్చేసే అనసూయ.. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసి కుర్రాళ్ళ మతి పోగొట్టింది. అనసూయ తన లేటెస్ట్ ఫొటోలోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Anasuya sleeveless blouse photos go viral

అనసూయ ధరించిన స్లీవ్‌లెస్ బ్లౌజ్ ఆమె అందాన్ని రెట్టింపు చేస్తూ, ఆమె స్టైల్ స్టేట్‌మెంట్‌కు మరింత మెరుపును అద్దినట్టు ఉంది. క్లాసిక్ నలుపు రంగులో ఉన్న ఈ బ్లౌజ్, ఆమె అందమైన భుజాలు , నాజూకైన చేతులను హైలైట్ చేస్తుంది. స్లీవ్‌లెస్ డిజైన్ ఆమెకు మరింత మోడర్న్, చిక్ లుక్‌ను ఇస్తుంది, అదే సమయంలో సంప్రదాయ చీరతో అద్భుతమైన కాంట్రాస్ట్‌ను సృష్టిస్తుంది. సింపుల్‌గా ఉన్నప్పటికీ, ఈ బ్లౌజ్ అనసూయ వ్యక్తిత్వంలోని బోల్డ్, కాన్ఫిడెంట్ వైపును తెలియజేస్తుంది.

క్యూట్ అందాలతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టేస్తోంది అనసూయ. రోజు రోజు గ్లామర్ డోస్ రెట్టింపు చేస్తూ తన అందచందాలతో మైమరిపిస్తుంది. సినిమా షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నా సోషల్ మీడియలో నిత్యం తెగ సందడి చేస్తోంది.తాజా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ముద్దుగుమ్మ అందాలకు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అన్నం తింటున్నావా.. అందం తింటున్నావా అనసూయ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+