Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Anasuya vs Shivaji:చివరిగా మరో బాంబు వేసిన అనసూయ..!!

Anasuya vs Shivaji:దండోర చిత్రంకు సంబంధించి జరిగిన ఓ కార్యక్రమంలో నటుడు శివాజీ హీరోయిన్లు ధరించే వస్త్రాలపై చేసిన కామెంట్స దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇది సోషల్ మీడియాలో కూడా ది మోస్ట్ ట్రెండింగ్ టాపిక్‌గా తయారైంది. శివాజీ కాంట్రవర్సీ కామెంట్స్‌కు ఇండస్ట్రీ నుంచి కొందరు మహిళా సెలబ్రిటీలు ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగా... మరికొందరు శివాజీకి జై కొట్టారు. ఇక మహిళల స్వాతంత్ర్యంకు సంబంధించి ఎక్కడైనా నెగిటివిటీ వస్తే దాన్ని ఖండించడంలో కౌంటర్ ఇవ్వడంలో యాంకర్ నటి అనసూయ భరద్వాజ్ ముందు వరుసలో ఉంటుంది. ఇక శివాజీ చేసిన వ్యాఖ్యలపై వరుస కౌంటర్లిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు అనసూయ. ఈ ఎపిసోడ్ కొనసాగుతుండగానే మరో ట్వీట్‌తో అనసూయ మళ్లీ ట్రెండ్ అవుతోంది.

వెనక్కి తగ్గని అనసూయ
నటుడు శివాజీ హీరోయిన్లు ధరించే బట్టలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆ తర్వాత ఆయన క్షమాపణలు కోరడం.. పలువురు సెలబ్రిటీలు ఆయన్ను తప్పుబట్టడం ఇవ్వన్నీ చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అనసూయ చేసి తొలి ట్వీట్ పై చాలామంది అసహనం వ్యక్తం చేశారు. "అది నా శరీరం నీది కాదు" అంటూ శివాజీ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. అనసూయ చేసిన ఈ కామెంట్స్ పై కొందరు తప్పుబట్టారు. ఆమెను వ్యక్తిగతంగా ట్రోల్ కూడా చేశారు. తనను ట్రోల్ చేస్తారని అనసూయకు ముందే తెలుసు అయినప్పటికీ ఆమె ఎక్కడా వెనక్కు తగ్గలేదు. తన పోరాటాన్ని కొనసాగిస్తోంది.

anasuya-vs-shivaji-if-im-an-aunty-why-is-he-a-garu-anasuya-slams-ageism-in-social-media-war

షాపింగ్ మాల్స్ ఓపెనింగ్‌కు అలా...
ఇక అనసూయ చేసిన పోస్టుపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీవీ డిబేట్లలో కూడా పాల్గొన్నారు. శివాజీ చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదన్నారు. ఒక వైపు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్‌కు సంప్రదాయ పద్దతిలో చీరకట్టులో వెళుతూ... మరోవైపు స్విమ్ సూట్‌లో ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేయడాన్ని ఎలా చూడాలని ప్రశ్నించారు. మగాళ్లకు ఆకలి ఎక్కువని..ఇలా ప్రవర్తిసే చాలా నేరాలు జరుగుతాయని ఓ మహిళ టీవీ డిబేట్లో చెప్పుకొచ్చారు. అంతేకాదు తాను షాపింగ్ మాల్స్ ఓపెనింగ్‌కు అలానే వెళుతుందా అంటూ కూడా ప్రశ్నించారు.

ప్రగతిశీల మహిళలే టార్గెట్..
అయితే వీటన్నిటిపై ఒకే ఒక ట్వీట్‌తో అనసూయ కౌంటర్ ఇచ్చారు. చాలామంది మగవారు ఆ మాటకొస్తే ఆడవారు కూడా తన వయసును కారణంగా చూపించి తనను చులకన చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడింది అనసూయ.సమాజంలో ఒక మహిళ తనకు తానుగా ఎదుగడాన్ని ఓర్చుకోలేని వీరంతా .. ప్రగతి శీల మహిళలను టార్గెట్‌గా చేసుకుంటారని ఫైర్ అయ్యింది.పాత తరాలు నేర్చుకున్నవి లేదా అలవాటుపడ్డ ఆలోచనలు మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని కంఠాపథంగా చెప్పుకొచ్చింది. ఆ ఆలోచనల నుంచి బయటకు రావాలని విజ్ఞప్తి చేసింది.ఎవరు ఎన్ని మాటలన్నా తాను మాత్రం స్వేచ్ఛగా తన పరిధిలో ఉండేందుకే ఇష్టపడతానని తేల్చేసింది.

నన్ను ఆంటీ.. తనను గారు అని పిలుస్తారా..?
ఉన్న సమస్యను పరిష్కరించడం చేతకాక తన వయసుపై పడి కొందరు ఏడుస్తున్నారని అనసూయ చెప్పుకొచ్చింది.40 ఏళ్ల తనను ఆంటీ అని పిలుస్తున్నారని.. 54 ఏళ్ల శివాజీని మాత్రం గారు అని గౌరవంగా పిలుస్తున్నారని అనసూయ గుర్తుచేశారు. తను, నటుడు శివాజీ ప్రొఫెషన్‌లో భాగంగా గ్లామర్, ఫిట్‌నెస్ మెయింటెన్ చేయడంలో తప్పులేదని అన్నారు.ఇక తనను ఆంటీ అంటూ హేళనగా మాట్లాడేవారంతా నిత్య యవ్వనులని అనసూయ సెటైర్ వేశారు. ఇలా ఎన్ని చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే అవుతుందని చెప్పిన అనసూయ చివరకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూ తన ట్వీట్‌ను ముగించారు.

మొత్తానికి శివాజీతో స్టార్ట్ అయిన ఈ సోషల్ మీడియా వార్ అనసూయ ఎంట్రీతో మరింత హీట్ పెంచింది. కొందరు శివాజీ రాజాకు మద్దతుగా నిలుస్తుంటే మరికొందరు అనసూయకు జై కొడుతున్నారు. అయితే ఈ వివాదం ఎప్పటికి ముగుస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+