నా మొగుడు చేతకాని వాడంటున్నారు.. అనసూయ షాకింగ్ కామెంట్స్

సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారిలో యాంకర్ అనసూయ కూడా ఒకరు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ తర్వాత యాంకర్‌గా , హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది. అనుసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టింది. ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే..అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అందం , అభినయం రెండూ ఉన్న అనసూయకు వివాదాలు కూడా కొత్తేం కాదు. బహిరంగంగానే ముద్దులు, హగ్గులు, బికినీలతో రచ్చ చేస్తూ..ట్రోలింగ్ బారిన పడుతున్నారామె. ఇక హీరో విజయ్ దేవరకొండతో వివాదం గురించి అందరికి తెలిసిందే. తనని విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా కౌంటరిస్తుంటుంది ఈ హాట్ బ్యూటీ. అనసూయ ఏం చేసినా సంచలనమే అన్నట్టుగా ఉంటోంది.

Anchor Anasuya makes open comments about her husband

40 ఏళ్ల వయస్సులో కూడా సూపర్ హాట్‌గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది. గ్లామర్‌గా కనిపించడానికి అనసూయ తెగ కష్టపడుతుంటుంది. ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే.

ఇదిలా ఉంటే అనసూయ తాజాగా ఓ ఇంటర్య్వూలో తన భర్త గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తన భర్త గురించి చాలా మంది "పర్‌ఫెక్ట్" అని అనుకుంటారని, కానీ వాస్తవానికి ఆయన కూడా మిగతా మగాళ్లలాగేనని ఆమె తెలిపారు.

సినిమా పరిశ్రమలో ఉండటం వల్ల తాను చాలా మందిని కలవాల్సి వస్తుందని, కొంతమందితో సినిమాలు చేయడం తన భర్తకు నచ్చని సందర్భాలు ఉన్నాయని అనసూయ వెల్లడించారు. తాను హీరోలతో, అందమైన స్టార్స్‌తో కలిసినప్పుడు ఆయన అసౌకర్యంగా ఫీలయ్యేవారని, దీని వల్ల తమ మధ్య గొడవలు కూడా జరిగాయని ఆమె చెప్పారు. అది అబ్బాయిల నేచర్ అంతే అని అనసూయ వ్యాఖ్యానించారు.

తన భర్తకు తెలుగు రాకపోవడం తమకు అదృష్టమని అనసూయ పేర్కొన్నారు. నన్ను ఫ్లర్ట్ చేయడం, కామెంట్స్ చేయడం చూసినప్పుడు ఆయనకి ఇబ్బంది. అందరూ అనసూయ భర్త అన్నీ ఒప్పుకుంటాడు అనుకుంటారు. వాడు చేతకాని వాడు అనేవాళ్లూ ఉన్నారు. అయితే అదృష్టం ఏమంటే మా ఆయనకి తెలుగు రాదు. సో.. సోషల్ మీడియాలో ఎవరేం రాస్తున్నారో పట్టించుకోడు అని ఆమె వివరించారు.

తన భర్తతో ఉన్నంత సౌకర్యంగా ఇంకెవరితోనూ ఉండలేనని అనసూయ స్పష్టం చేశారు. ఎవరైనా తనను తప్పుగా చూస్తే, తాను కూడా వారిని అదే విధంగా చూస్తానని, అది మనిషి సహజ స్వభావమని ఆమె అన్నారు. తన భర్తకే కాదు, తనకూ కొన్ని సందర్భాల్లో ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్స్ వచ్చాయని అంగీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+