తప్పు తప్పు.. అంతకు ముందు అలా చేయలేదా ?? అనసూయ పోస్ట్ వైరల్ !!

తెలుగు సినీ పరిశ్రమలో గతంలో పెద్ద దుమారం రేపిన 'డ్రెస్సింగ్' వివాదం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో యాంకర్-నటి అనసూయ గట్టిగా స్పందించడంతో ఈ విషయం 'శివాజీ వర్సెస్ అనసూయ'గా మారి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది.

ఆ సమయంలో శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్రబిందువయ్యాయి. "మహిళలు నిండుగా కప్పుకునే దుస్తుల్లోనే అందంగా కనిపిస్తారు. బహిరంగంగా శరీర భాగాలు కనిపించేలా దుస్తులు ధరించినప్పుడు బయటకు నవ్వినా, లోపల మాత్రం విమర్శిస్తారు" అన్న ఆయన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సినీ ప్రముఖులు, మహిళా సంఘాలు, నెటిజన్లు ఈ వ్యాఖ్యలను ఖండించారు.

anchor-anasuya-shocking-reply-over-wearing-saree-issue-and-counter-goes-viral-on-social-media

ఈ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా Anasuya Bharadwaj అప్పట్లోనే కౌంటర్ ఇచ్చారు. "మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలనేది వారి వ్యక్తిగత స్వేచ్ఛ. పురుషుల ప్రవర్తన, వారి మనస్తత్వమే అసలు సమస్య" అని ఆమె స్పష్టం చేశారు. ఆమె వ్యాఖ్యలకు పలువురు మహిళా సంఘాలు మద్దతు తెలపడంతో ఈ వివాదం మరింత వేడెక్కింది. కొంతకాలం తర్వాత ఈ వివాదం సద్దుమణిగినా, తాజాగా అనసూయ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్‌తో మళ్లీ చర్చకు వచ్చింది.

ఏం జరిగిందంటే..

ఇటీవల ఆమె తన భర్తతో కలిసి చీరలో కనిపించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీనిపై ఓ న్యూస్ ఛానల్ "శివాజీ దెబ్బతో చీరలోకి మారిన అనసూయ" అనే విధంగా హెడ్డింగ్ ఇవ్వడం వివాదానికి నాంది పలికింది. దీనిపై స్పందించిన అనసూయ సెటైరికల్‌గా స్పందిస్తూ, "శివాజీ సృష్టించిన చీర అనే వస్త్రాన్ని ధరించి తిరుగుతున్న అనసూయ" అని హెడ్డింగ్ పెట్టాల్సిందని ఎద్దేవా చేశారు. "అంతకుముందు మేమెప్పుడూ చీరలు కట్టుకోలేదా?" అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఫుల్ వైరల్ గా మారింది.

అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ అంశంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అనసూయకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు శివాజీ వ్యాఖ్యలను సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వివాదం కేవలం ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత విభేదం మాత్రమే కాకుండా, సమాజంలో మహిళల దుస్తులు, వ్యక్తిగత స్వేచ్ఛ, పురుషుల దృక్పథం వంటి విస్తృత అంశాలపై చర్చకు దారి తీస్తోంది. సోషల్ మీడియా విస్తరణతో ఇలాంటి అంశాలు వేగంగా వైరల్ అవుతూ, పెద్ద చర్చలకు కారణమవుతున్నాయి.

ఇక అనసూయ యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించి, తన ప్రతిభ, చలాకీ మాటలు, డాన్స్‌లు, స్టేజ్ ప్రెజెన్స్‌తో అతి తక్కువ కాలంలోనే విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా 'జబర్దస్త్' షో ద్వారా ఇంటింటా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ, ఆ తర్వాత సినిమాల వైపు అడుగులు వేసి అక్కడ కూడా తనదైన ముద్ర వేసింది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'రంగస్థలం' సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+