"అదే నిజమైన హీరోయిన్.. మిగతావాళ్లు కేవలం" .. అనసూయ సంచలన పోస్టు..

టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇటీవల పలు కారణాలతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ నటుడు శివాజీ.. హీరోయిన్లు వస్త్రధారణతో మొదలైన వివాదం పలు రకాలుగా మలుపులు తిరుగుతోంది. ఇదే విషయం గురించి మాట్లాడుతూ.. తాను కూడా హీరోయిన్ గా చేశానని అనసూయ వివరణ ఇచ్చారు. దాంతో ఆమెపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేశారు. అనసూయ హీరోయిన్ కాదు కదా.. అంటూ ఆమె వ్యాఖ్యలను వైరల్ చేశారు. ఈ క్రమంలో అనసూయ తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ స్టేటస్ లో హీరోయిన్ అంశంపై సంచలన పోస్టు పెట్టారు.

"హీరోయిన్ తెరపై కాదు.. సత్యం మాట్లాడే ధైర్యం, సొంత దారిలో నడిచే శక్తి.. సరైన దాని కోసం నిలబడే గుండె, అదే నిజమైన హీరోయిన్.. మిగతావాళ్లు కేవలం నటులు మాత్రమే" అంటూ ఇన్‌ స్టాగ్రామ్‌ వేదికగా నటి, యాంకర్ అనసూయ పోస్టు చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంతేకాక హీరోయిన్ అని గూగుల్ లో సెర్చ్ చేసి ఆ వచ్చిన అర్ధాన్ని ఇన్ స్టా లో పెట్టారు అనసూయ. అలాగే హీరోయిన్ అనే పదానికి అర్ధం ధైర్యము గల స్త్రీ అని గూగుల్ ట్రాన్స్ లేట్ ను జత చేశారు అనసూయ. కామెంట్స్ చేసేముందు ఇవి తెలుసుకోవాలని సూచించారు.

Anchor Anasuya s Powerful Post Goes Viral True Heroine Stands for Right Fans Call Her Real Heroine

మరోవైపు ఇటీవల సీనియర్ హీరోయిన్ రాశి విషయంలో అనసూయ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు తన క్షమాపణ లేఖను ఎక్స్ లో పోస్టు చేశారు. మూడేళ్ల క్రితం ఓ షోలో తనను కించపరిచేలా అనసూయ మాట్లాడారంటూ హీరోయిన్ రాశి ఫైర్ అయిన క్రమంలో .. అనసూయ క్షమాపణలు చెప్పారు. ఆ వ్యాఖ్యలు రాయించి, డైరెక్ట్ చేసిన వ్యక్తిని ఆ రోజునే నిలదీయాల్సి ఉండగా అప్పుడు తనకు అంత శక్తి లేక సైలెంట్ గా ఉన్నానని తెలిపారు. మనుషులు మారుతారని.. ఆ షో విడిచి పెట్టాక తనలో మార్పును గమనించాలని లేఖలో కోరారు. ఈ మేరకు అనసూయ పోస్టు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+