ముద్దులతో రెచ్చిపోయిన తెలుగు యాంకర్.. వీడియో వైరల్ !
యాంకర్ టూ యాక్టర్ గా మారిన వారు ఎందరో ఉన్నారు. బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. నిలదొక్కుకున్నవారు.. వెనుదిరిగిన వారు ఉన్నారు. ఈ జాబితాలో లేడీస్ విషయానికి వస్తే.. ఇప్పటికే సుమ, ఝాన్సీ, అనసూయ, రష్మీ, శ్రీముఖి, దీపికా పిల్లి వంటి అనేకమంది యాంకర్లు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అదే బాటలో ముందుకు సాగుతోంది యాంకర్ హర్షిణి.
ప్రముఖ యాంకర్ హర్షిణి అందరికీ సుపరిచితురాలే. "అమీతుమీ" సినిమా ప్రమోషన్స్ సమయంలో ఇంద్రగంటిని ఇంటర్వ్యూ చేసిన హర్షిణి.. అప్పుడే ఆయన దృష్టిలో పడింది. దాంతో ఆమె తన సినిమాలో పాత్రకు సరిగ్గా సరిపోతుందని భావించి ఛాన్స్ ఇచ్చారు. అలా "సమ్మోహనం" సినిమాలో హీరో సిస్టర్ పాత్రలో నటించి మెప్పించింది.

ఆ తర్వాత "సారంగపాణి జాతకం" చిత్రంలో కూడా నటించింది. కాగా హర్షిణి ఇప్పటి వరకు 25 సినిమాలకు పైగా నటించింది. వాటిలో కొన్ని విడుదలయ్యాయి, మరికొన్ని ప్రొడక్షన్ దశలోనే ఆగిపోయాయి. అయినా ఇంత తక్కువ కాలంలోనే ఎక్కువ సినిమాల్లో నటించడం అంటే మాములు విషయం కాదని తెగ పొగిడేస్తున్నారు.
లిప్ లాక్స్..
అయితే సాధారణంగా యాంకర్లు రొమాంటిక్ సీన్లలో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపిన సందర్భాలు తక్కువ అనే చెప్పాలి, కానీ హర్షిణి మాత్రం ఆ రిస్క్ తీసుకుని ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. మూడు సంవత్సరాల క్రితం అర్జున్ కళ్యాణ్‌తో కలసి చేసిన "కళ్లు కళ్లు కలిసే క్షణమే" అనే పాటలో ఆమె ముద్దులు, హగ్గులు ఇచ్చే సీన్లతో తెరపై హాట్‌గా కనిపించింది. ఈ వీడియో పాట అప్పట్లోనే సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది.
ఇప్పుడు ఆ సాంగ్ మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ హర్షిణి గురించి జోరుగా చర్చ జరిగేలా చేసింది. అంతే కాకుండా హర్షిణి వీజే సన్నీ హీరోగా నటించిన "ఏటీఎం" వెబ్ సిరీస్‌లో కూడా పలు బోల్డ్ సీన్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
మొత్తానికి హర్షిణి చేసిన సినిమాలు, పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండడంతో.. ఆమెపై మళ్లీ నిర్మాతల దృష్టి పడుతోంది. ప్రస్తుతం కొన్ని కొత్త ప్రాజెక్టులు కూడా చర్చలో ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. మరి చూడాలి రానున్న రోజుల్లో ఈ భామ ఎలాంటి విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాల్సిందే.
-
స్టార్ బ్యూటీతో కలిసి సైలెంట్‌గా ఓటీటీ డెబ్యూ ఇస్తున్న యంగ్ హీరో !! -
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా? -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
సమంత, రాజ్ నిడిమోరు క్యూట్ వీడియో వైరల్..! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
రామ్ చరణ్ 'పెద్ది'లో క్రేజీ ఐటమ్ సాంగ్.. ముగ్గురు స్టార్ హీరోయిన్లతో మాస్ స్టెప్పులు -
అనుష్క పెళ్లి ట్విస్ట్: ఆ విషయాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? -
ధురంధర్2, ఉస్తాద్ భగత్ సింగ్.. వీటిల్లో ఏ సినిమాకు వెళ్లాలి? -
‘ధురంధర్2’లో హైలైట్స్ ఇవే.. దద్ధరిల్లుతున్న థియేటర్లు -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
తెలంగాణ గద్దర్ అవార్డుకు ఎంపికైన తొలి బయోపిక్ ఇదే.. స్పెషాలిటీ అదే !!











Click it and Unblock the Notifications