Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముస్లింలను రెచ్చగొట్టిన యాంకర్ రష్మి...చీర రెడీ అంటూ పోస్ట్

బుల్లితెర యాంకర్ రష్మి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన రష్మి.. సినిమాల్లో సరైన అవకాశాలు దొరక్కపోవడంతో బుల్లితెర మీద యాంకర్ అవతారం ఎత్తింది. జబర్థస్త్ షోలో యాంకర్‌గా కనిపించిన తరువాత రష్మి జాతకమే మారిపోయింది. జబర్థస్త్ షో రష్మికి ఫుల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది.

ముఖ్యంగా రష్మి -సుడిగాలి సుధీర్‌ల మధ్య కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. టీవీ రంగంలో రష్మి -సుడిగాలి సుధీర్‌లపెయిర్ సంచలనం సృష్టించారని అని చెప్పాలి. వీరిద్దరూ కలిసి కనిపిస్తే చాలు ఆ షో సూపర్ హిట్ అనే రేంజ్‌కి వెళ్లిపోయిందంటే వీరి క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో రష్మి పలు సినిమాల్లో హీరోయిన్‌గా కూడా అవకాశాలు దక్కించుకుంది.

 Anchor Rashmi Gautam Shocking Post Goes Viral

ఇదిలా ఉంటే రష్మి జంతు ప్రేమికురాలనే విషయం అందరికి తెలిసిందే. కరోనా సమయంలో కూడా ఆమె రోడ్డు మీద ఉన్న జంతువులకు ఆహారం అందించి తన ఉదారతను చాటుకుంది. జంతువులను ఎవరైనా హింసిస్తే అదే రీతిలో ఫైర్ అయ్యేదామె. తాజాగా రష్మి ముస్లింలను ఉద్దేశించి చేసిన ఓ ట్విట్ సంచలనంగా మారింది.

బక్రీద్ పండగనాడు ముస్లిం సాంప్రదాయంలో భాగంగా జంతు బలులను ఆమె బహిరంగానే ఖండించింది. ఆచారం పేరుతో జంతు బలులు ఇవ్వడం మానుకోవాలని ముస్లింలకు రష్మి హితవు పలికింది. ఇది చూసిన ముస్లింలు, నెటిజన్లు ఆమెను ఘెరంగా ట్రోల్ చేస్తున్నారు. తనని ట్రోల్ చేస్తున్న వారికి రష్మి అదే రేంజ్‌లో కౌంటరిచ్చింది. విమర్శించి వారికి సమాధానం ఇవ్వడానికి నా దగ్గర సమయం లేదు.

 Anchor Rashmi Gautam Shocking Post Goes Viral

నేను కాషాయ రంగు చీర సిద్ధం చేసుకున్నాను. దీపాలు వెలిగించాలి. ఇక నుంచి ఏడాదికి రెండు దీపావళులు చేసుకోవాలి. రాముడు, సీత తన ఇంటికి తిరిగి వచ్చేశారు. జై శ్రీరామ్ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. అయోధ్య రామమందిర్ విగ్రహ ప్రతిష్టాపన వేళ రష్మి చేసిన ఈ ట్విట్ ముస్లింలను మరింత రెచ్చగొట్టినట్టు అయింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

కొందరు రష్మి అనసూయను ఫాలో అవుతుందంటూ విమర్శిస్తుంటే.. మరి కొందరు ఆమె తన భావజాలాన్ని తెలిపిందంటూ రష్మికి మద్దతుగా నిలుస్తున్నారు. ముస్లిం సాంప్రదాయాలకు వ్యతిరేకంగా రష్మి చేసిన ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+