బాంబు పేల్చిన రష్మీ... మెహందీ ఫొటోలు వైరల్... పెళ్లికొడుకు ఎవరో?
యాంకర్ రష్మీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరంలేదు. బుల్లితెరపై యాంకర్లలో స్టార్ యాంకర్ గా చెలామణి అవుతోంది. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్ షోలు రష్మీకి పాపులారిటీని తీసుకొచ్చాయి. కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించేది. తర్వాత హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఒడిసా రాష్ట్రానికి రష్మీగౌతమ్ ప్రస్తుతం హైదరాబాద్ లో స్థిరపడ్డారు. బుల్లితెరపై సుడిగాలి సుధీర్-రష్మీ జంట సూపర్ అని చెప్పొచ్చు. కేవలం తెరపైనే వారిద్దరూ ప్రేమికులుగా నటించినప్పటికీ నిజ జీవితంలో మాత్రం కేవలం స్నేహితులే. అది కేవలం తెరపై మాత్రమేనని, వ్యక్తిగత జీవితంలో అటువంటిదేమీ లేదని సుధీర్ తేల్చిచెప్పాడు.
పెళ్లి కొడుకు ఎవరని అడుగుతున్న నెటిజన్లు
ప్రస్తుతం సినిమాల్లో హీరోగా చేస్తున్న సుధీర్ బుల్లితెర కార్యక్రమాలకు అప్పుడప్పుడు వస్తున్నాడు. రష్మీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా రష్మీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో వైరల్ గా మారింది. లేత గులాబీరంగు డ్రెస్ వేసుకొని మెహందీ పెట్టించుకుంటున్న ఫొటోలను షేర్ చేసింది. ఫొటోల్లో ఓ కన్ను కొడుతుంది. దీనికి టైమ్ టూ ఫొటో బాంబ్, మైఫీడ్ అనే పేరు పెట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో మెహందీ పెట్టించుకుంటున్న ఫొటో కావడంతో నెటిజన్లంతా పెళ్లి చేసుకుంటున్నావా? ఎప్పుడు పెళ్లి? పెళ్లి కొడుకు ఎవరు? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

పాత వీడియోను వైరల్ చేయొద్దు
రష్మీ ఎక్కువగా మూగ జీవాల రక్షణకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. వీటితోపాటు సమాజంలో నిత్యం జరుగుతున్న సంఘటనలపై స్పందిస్తుంటుంది. ఇటీవలే సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి వ్యాఖ్యానించింది. రాజ్ తరుణ్, జానీ మాస్టర్, యూట్యూబర్ హర్ష సాయితోపాటు మళయాళ పరిశ్రమలో, తమిళంలో కాస్టింగ్ కౌచ్ పై వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనిపై గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. కాస్టింగ్ కౌచ్ లాంటి ఘటన ఎదురైనప్పుడు నిరభ్యంతరంగా తిరస్కరించాలని, కెరీర్ లో ముందుకు వెళ్లాలనే లక్ష్యంతో కొందరు ఓకే అంటున్నారని, కానీ ఎవరినీ ఎవరూ బలవంతం చేయరని, అత్యాచారం చేస్తే మాత్రం చాలా తప్పు అని రష్మీ వ్యాఖ్యానించింది. అయితే తాను మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో పాత వీడియో అని, దాన్ని ఎవరూ వైరల్ చేయొద్దని విన్నవించుకుంటోంది.












Click it and Unblock the Notifications