రష్మి సీరియస్ ..జబర్దస్త్ నటుడుని చెప్పుతో కొడతానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
బుల్లితెర యాంకర్ రష్మి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన రష్మి.. సినిమాల్లో సరైన అవకాశాలు దొరక్కపోవడంతో బుల్లితెర మీద యాంకర్ అవతారం ఎత్తింది. జబర్థస్త్ షోలో యాంకర్‌గా కనిపించిన తరువాత రష్మి జాతకమే మారిపోయింది. జబర్థస్త్ షో రష్మికి ఫుల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా రష్మి -సుడిగాలి సుధీర్‌ల మధ్య కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.
టీవీ రంగంలో రష్మి -సుడిగాలి సుధీర్‌లపెయిర్ సంచలనం సృష్టించారని అని చెప్పాలి. వీరిద్దరూ కలిసి కనిపిస్తే చాలు ఆ షో సూపర్ హిట్ అనే రేంజ్‌కి వెళ్లిపోయిందంటే వీరి క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో రష్మి పలు సినిమాల్లో హీరోయిన్‌గా కూడా అవకాశాలు దక్కించుకుంది. యాంకర్ రష్మీ ఇటీవల కాలంలో నిత్యం వార్తాల్లో నిలుస్తున్నారు. లేటెస్ట్ ఫొటో షూట్‌లతో పాటు, తన కామెంట్స్‌తో రష్మి పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది.

ఇక జబర్దస్త్ షో ఒకటైన సంగతి అందరికి తెలిసిందే.గతంలో జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ రెండు షోలు ప్రసారం అయ్యేవి. అయితే షోకు రేటింగ్స్ భారీగా పడిపోవడంతో ఎక్స్ట్రా జబర్దస్త్‌ను నిలిపి వేస్తున్నట్టు నిర్వహుకులు ప్రకటించారు. దీంతో జబర్దస్త్ షో ఒక్కటి మాత్రమే ప్రసారం అవుతోంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు. ఈ ప్రొమోలో కామెడియన్ నూకరాజు రష్మిని టీజ్ చేశాడు.
నూకరాజు రష్మీని చూస్తూ.. ఏం రష్మి ఎలా ఉన్నావ్ అని అడిగాడు. దానికి 'నేను బాగానే ఉన్నాను కానీ ఏంటి కామెడీ ఉందా? అని రష్మి ప్రశ్నించింది. అప్పుడు నూకరాజు ఏమి వినబడనట్టు యాక్ట్ చేశాడు. దీంతో మరోసారి 'స్కిట్టులో కామెడీ ఉందా' అని మళ్ళీ ప్రశ్నించింది. మళ్లీ ఏం వినపడనట్టే చేసి.. 'ఆ' అంటూ నూకరాజు పక్కకి తిరిగాడు. అప్పుడు రష్మి.. 'సరే ఇటు రా ముద్దు పెడతా' అని అనడంతో అప్పుడు వస్తున్నా అని ఆశగా ఆమె వైపు రాబోయాడు నూకరాజు. దీంతో రష్మీ.. 'చెప్పు తీసుకుని కొడతా' అని సీరియస్ అవ్వడంతో వెనక్కి వెళ్ళిపోయాడు. ఇదింతా కూడా సరాదగా జరగడంతో అందరూ నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రొమో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications