Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చెప్పు తెగుద్ది.. మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా..? ఆ నటుడుకి వార్నింగ్ ఇచ్చిన యాంకర్ రష్మి

బుల్లితెర యాంకర్ రష్మి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన రష్మి.. సినిమాల్లో సరైన అవకాశాలు దొరక్కపోవడంతో బుల్లితెర మీద యాంకర్ అవతారం ఎత్తింది. జబర్థస్త్ షోలో యాంకర్‌గా కనిపించిన తరువాత రష్మి జాతకమే మారిపోయింది. జబర్థస్త్ షో రష్మికి ఫుల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా రష్మి -సుడిగాలి సుధీర్‌ల మధ్య కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.

టీవీ రంగంలో రష్మి -సుడిగాలి సుధీర్‌లపెయిర్ సంచలనం సృష్టించారని అని చెప్పాలి. వీరిద్దరూ కలిసి కనిపిస్తే చాలు ఆ షో సూపర్ హిట్ అనే రేంజ్‌కి వెళ్లిపోయిందంటే వీరి క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో రష్మి పలు సినిమాల్లో హీరోయిన్‌గా కూడా అవకాశాలు దక్కించుకుంది. యాంకర్ రష్మీ ఇటీవల కాలంలో నిత్యం వార్తాల్లో నిలుస్తున్నారు. లేటెస్ట్ ఫొటో షూట్‌లతో పాటు, తన కామెంట్స్‌తో రష్మి పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది.

Anchor Rashmi warns Jabardasth actors

ఇక జబర్దస్త్ షో ఒకటైన సంగతి అందరికి తెలిసిందే.గతంలో జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ రెండు షోలు ప్రసారం అయ్యేవి. అయితే షోకు రేటింగ్స్ భారీగా పడిపోవడంతో ఎక్స్ట్రా జబర్దస్త్‌ను నిలిపి వేస్తున్నట్టు నిర్వహుకులు ప్రకటించారు. దీంతో జబర్దస్త్ షో ఒక్కటి మాత్రమే ప్రసారం అవుతోంది. అయినప్పటికీ, షోకు క్రేజ్ మాత్రం రావడం లేదు.పేరున్న నటులు జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడంతో షో క్రేజ్ తగ్గిపోయింది. దీంతో జబర్దస్త్‌ను చూసేవారి సంఖ్య తగ్గిపోయింది. అలాగే షోను ముందుకు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ ప్రోమోలో యాంకర్ రష్మి బుల్లెట్ భాస్కర్‌‌ను చెప్పు తెగుద్ది అని వార్నింగ్ ఇచ్చింది. స్కిట్‌లో భాగంగా రష్మివైపు చూసి సైగల్‌ చేస్తాడు బుల్లెట్ భాస్కర్‌‌. దీంతో అతన్ని వైపు చూస్తూ చెప్పు తెగుద్ది అంటూ అందరి ముందు వార్నింగ్‌ ఇచ్చింది. మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా అంటూ బుల్లెట్ భాస్కర్‌‌‌ను రష్మి ప్రశ్నిస్తుంది. ఆడవాళ్లు ఉన్నారు.. వదిన లేదని మా చెల్లెలు బాధపడుతున్నారంటూ రష్మికి కౌంటరిస్తాడు బుల్లెట్ భాస్కర్‌‌. ఇదింతా కూడా స్కిట్‌లో భాగంగానే జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+