నిద్రమాత్రలు మింగిన యాంకర్ శివజ్యోతి
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుతున్నారనే విషయం తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈజీగా రీచ్ కావొచ్చనే అభిప్రాయం చాలామంది సెలబ్రిటీల్లో నెలకొంది. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన లిస్ట్‌లో యాంకర్ సావిత్రక్క అలియాస్ శివజ్యోతి కూడా కచ్చితంగా ఉంటారనే చెప్పాలి.
తీన్మార్ వార్తల ద్వారా వెలుగులోకి వచ్చిన శివజ్యోతి ఆ తర్వాత పలు షోలకు యాంకరుగా పని చేశారు. ఒక న్యూస్ ఛానెల్‌లో 'సావిత్రక్క'గా పేరు తెచ్చుకున్న ఆమె, ఆ తర్వాత పలు ఛానెళ్లలో పనిచేసి, ప్రస్తుతం బుల్లితెరపై వివిధ షోలలో సందడి చేస్తున్నారు. తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ షోలో కూడా ఆమె అడుగుపెట్టారు. శివజ్యోతి ప్రస్తుతం సొంత యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి, అందులో వీడియోలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే శివజ్యోతి గతంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారనే వార్త ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్‌లో వచ్చింది.

శివజ్యోతి చిన్న వయసులోనే 'గంగులు' అనే యువకుడిని ప్రేమించింది. ఈ ప్రేమ కారణంగా తీవ్ర కష్టాలను ఎదుర్కొన్నారు. పదో తరగతికి వచ్చేసరికి వారి ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఆమెను వెంటనే ముంబైలోని బంధువుల వద్దకు పంపించి, అక్కడ ఉంచారు.
కొన్నాళ్లకు ఆమె మళ్లీ స్వగ్రామానికి తిరిగి వచ్చారు. అప్పుడు గంగులును వదిలి తాను ఉండలేనని కుటుంబ సభ్యులకు తేల్చి చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో తీవ్ర భయాందోళనకు గురైన శివజ్యోతి, వెంటనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి
తరలించి ఆమెను కాపాడుకున్నారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం ఆమెను హైదరాబాద్‌కు పంపించగా, తన సోదరుడితోపాటు తన ప్రియుడు గంగులుతో కలిసి ఒకే గదిలో నివసించారు.
గంగులు కష్టపడి చదివి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించగా, శివజ్యోతి టెలీ కాలర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత టీవీ యాంకర్‌గా ఎదిగారు. ఇద్దరూ కొంత స్థిరపడ్డాక, నిజామాబాద్‌లోని సాయిబాబా ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె బిగ్‌బాస్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం టీవీ షోలలో మెరుస్తూ ప్రేక్షకుల మధ్య సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె భర్త గంగులు కూడా వినోద రంగంలో భాగమై ఉన్నారు. శివజ్యోతి యూట్యూబర్‌గా, భర్తతో కలిసి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా రాణిస్తూ, ఆకట్టుకునే జీవితాన్ని గడుపుతున్నారు.












Click it and Unblock the Notifications