Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైపర్ ఆది వల్లే జబర్దస్త్ మానేశా - యాంకర్

సౌమ్య రావు.. బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కర్ణాటకలోని షిమోగాలో జన్మించిన ఈమె.. 2018లో టెలివిజన్ రంగంలో తమిళ సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించింది. రోజా సీరియల్ తో ప్రేక్షకుల్లో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ క్రేజ్ తోనే తెలుగులో కూడా 'శ్రీమంతుడు' సీరియల్ లో నటించి మెప్పించింది. అయితే ఈ భామకు బ్రేక్ మాత్రం జబర్థస్త్ షో ద్వారానే దక్కిందని చెప్పాలి. జబర్దస్త్‌లో తక్కువ కాలమే యాంకర్ గా పని చేసినా.. మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. తన అందం, యాంకరింగ్ స్టైల్ ఆడియన్స్ ని బాగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా హైపర్ ఆదితో కలిసి ఆమె వేసిన కౌంటర్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అయితే ఒక్కసారిగా షో నుంచి మాయమైంది ఈ కన్నడ భామ. దీంతో ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆమె ఎందుకు వెళ్లిపోయిందన్న దానిపై సోషల్ మీడియా లోనే కాకుండా సినీ వర్గాలలో కూడా చర్చనీయాంశం అయ్యింది. ముఖ్యంగా హైపర్ ఆది వల్లే ఆమె జబర్దస్త్ మానేశారని గుసగుసలు కూడా వినిపించాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన బోల్డ్ కామెంట్స్ సంచలనంగా మారాయి.

anchor-soumya-rao-comments-about-quitting-jabardasth-comedy-show-and-comedian-hyper-aadi-goes-viral

ఆమె ఏమన్నారంటే..

తాను జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడానికి కారణం హైపర్ ఆది కాదని తేల్చి చెప్పింది. ఆదికి ఆ విషయానికి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. పాపం ఆది ఎందుకు కారణం? మొదటి నుంచి ఆయనే నాకు సపోర్ట్ చేశారు. స్టేజ్‌పై ఎలా మాట్లాడాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అన్నవి నేర్పారని చెప్పుకొచ్చింది. శ్రీదేవి డ్రామా కంపెనీ'కి కూడా ఆయనే అవకాశం కల్పించారని అన్నారు. ఈ వ్యాఖ్యలతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టు అయ్యింది.

అలానే అప్పుడప్పుడు వైన్ తాగుతాను అని చెప్పుకొచ్చారు. మైండ్ ఫ్రెష్‌గా ఉండడానికి ఒకటి లేదా రెండు పెగ్స్ తాగుతానని వెల్లడించారు. అందులో అబద్ధం చెప్పడానికి ఏం లేదని.. తానేం పతివ్రతను కాదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఫేక్‌గా చెప్పడం ఎందుకు అంటూ తెలిపారు. కానీ డ్రింకింగ్ అలవాటుగా మారకూడదని.. లిమిట్‌లో ఉంటేనే బాగుంటుందని అన్నారు. అంతే కాకుండా డ్రింక్ చేసిన తర్వాత ఇండస్ట్రీ గురించే ఎక్కువగా ఆలోచిస్తానని ఓపెన్ అయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+