పెళ్లి తర్వాత ఇలాంటి ఫొటో షూట్ అవసరమా అధ్యక్షా ..?
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుతున్నారనే విషయం అందరికి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈజీగా రీచ్ కావొచ్చనే అభిప్రాయం చాలామంది సెలబ్రిటీల్లో నెలకొంది. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారిలో యాంకర్ స్రవంతి చొక్కారపు కూడా ఒకరని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో యాంకర్ స్రవంతి చొక్కారపు పేరు మార్మోగిపోతోంది. యూట్యూబ్‌లో ఓ ఛానల్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన స్రవంతి చొక్కారపు. తన అంచదందాలతో పాటు చురుకైన మాటలతో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది.వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో జరిపిన ఓ ఇంటర్య్వూలో స్రవంతి లైఫ్ లైన్లోకి వచ్చింది.

ఆ తరువాత పుష్ప విడుదల సమయంలో చిత్ర యూనిట్‌తో చేసిన ఇంటర్య్వూ స్రవంతి కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌లను స్రవంతి ఇంటర్య్వూ చేసింది. ఆ సమయంలో ఆమె మాట్లాడిన రాయలసీమ యాసకు వీరిద్దరు ఫిదా అయ్యారు. రాయలసీమ సినిమాలు తీస్తే కచ్చితంతంగా స్రవంతి రిఫరెన్స్ తీసుకుంటామని చెప్పడంతో ఓవర్ నైట్ స్టార్ మారిపోయింది.

పలు షోలకు యాంకరింగ్ చేస్తూ తన పాపులారిటీని మరింత పెంచుకుంది. తనకు వచ్చిన ఈ క్రేజ్‌తో బిగ్‌బాస్‌లో కూడా అడుగుపెట్టింది ఈ హాట్ బ్యూటీ. భామకు పెళ్ళైనప్పటికీ గ్లామర్ షో మాత్రం తగ్గించడం లేదు. దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక ఈ మధ్య గ్లామర్ డోస్ బాగా పెంచింది.
ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ హాట్ ఫోజులతో కుర్రకారకు నిద్రలేకుండా చేస్తోంది. డైలీ కొత్త కొత్త ఫొటో షూట్స్ ను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు మైకం తెప్పిస్తోంది. రోజు రోజుకు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఫాలోవర్లను పెంచుకుంటుంది. రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేసి అందాల వడ్డింపులో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. గ్లామర్ డోస్‌పై అభిమానులు ఖుషీ అవుతుండగా, మరికొందరు పెళ్లి తర్వాత ఇలాంటి ఫొటో షూట్‌లు అవసరమా అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఎవరెన్ని కామెంట్స్ చేసిన స్రవంతి మాత్రం తన అందాల దాడిని మాత్రం ఆపడం లేదు.












Click it and Unblock the Notifications