స్టేజ్ మీదనే హీరోపై చేయి చేసుకున్న యాంకర్
ఓ యంగ్ హీరో చెంప పగలగొట్టింది స్టార్ యాంకర్ శ్రీముఖి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇదింతా ఓ సినిమా ప్రమోషన్స్‌కు భాగంగా జరిగినట్టు స్పష్టం అవుతుంది. ఇటీవల కాలంలో సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. సినిమాను జనాల్లోకి తీసుకువెళ్లడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ''మార్కెట్ మహాలక్ష్మి'' సినిమా ప్రమోషన్‌లో భాగంగా యాంకర్ శ్రీముఖి యంగ్ హీరో చెంప పగలగొట్టింది.
కేరింత సినిమాలో నూకరాజు పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు పార్వతీశం. ఇందులో తనదైన కామెడీ.. శ్రీకాకుళం యాసతో అలరించాడు. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు ఆయన హీరోగా వస్తున్న సినిమా ''మార్కెట్ మహాలక్ష్మి''. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్లలో బిజీగా మారింది. ఈ మూవీని జనాల్లోకి తీసుకెళ్లేందుకు డిఫరెంట్‌గా ప్లాన్ చేసింది. దీనిలో భాగంగానే స్టార్ యాంకర్ శ్రీముఖితో ప్రమోషన్స్‌ను మొదలుపెట్టింది చిత్ర యూనిట్.

హీరో పార్వతీశం శ్రీముఖి వద్దకు వెళ్లి.. మీరంటే నాకు ఇష్టమండి.. ఐ లవ్ యూ అని చెప్తాడు. దీంతో శ్రీముఖి అతడి చెంపపై ఒక్కటి ఇస్తుంది. ఆ తరువాత అతడు వెళ్లిపోతుంటే పిలిచి.. మార్కెట్ మహాలక్ష్మి ఇక్కడ.. మజాక్ లాడితే మంచిగుండదు అంటూ సినిమాలోని డైలాగ్ చెబుతూ వార్నింగ్ ఇస్తోంది. తాజాగా విడుదలైన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇక ఈ చిత్రాన్ని ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.












Click it and Unblock the Notifications