పెళ్లి పీటలెక్కబోతున్న శ్రీముఖి... ప్రేమించిన వ్యక్తితోనే వివాహం..?
యాంకర్ శ్రీముఖి పెళ్లిపీటలెక్కబోతుందా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. చాలాకాలంగా శ్రీముఖిపెళ్లి చేసుకోబోతుందంటూ అనేక వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ వార్తలను ఇప్పుడు నిజం చేసే పనిలో పడిందట ఈ బుల్లితెర బ్యూటీ. ఆ వివారాల్లోకి వెళ్తే..యాంకర్ శ్రీముఖి బుల్లితెర మీద ఎప్పుడు చూసినా సూపర్ ఎనర్జటిక్‌గా కనిపిస్తుంటుంది.
యాంకర్స్ కూడా ఇంత గ్లామర్‌గా కనిపిస్తారని శ్రీముఖిని చూస్తే అర్థం అవుతుంది. తనదైన యాంకరింగ్‌తో చాలామంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ హాట్ బ్యూటీ. అయితే గత కొంతకాలంగా శ్రీముఖి పెళ్లి గురించి అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆ మధ్య యాంకర్ ప్రదీప్‌తో శ్రీముఖి ప్రేమలో ఉందని.. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

అయితే అలాంటిది ఏమీ లేదని..తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని ప్రదీప్, శ్రీముఖి ఇద్దరూ దీనిపై వివరణ ఇచ్చారు. తాజాగా మరోసారి శ్రీముఖి పెళ్లి వార్త వైరల్ అవుతుంది. శ్రీముఖి తండ్రి ఆమెకు పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారట. దీనికి శ్రీముఖి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే శ్రీముఖిది పెద్దల కుదిర్చిన వివాహమా లేక ప్రేమ వివాహమా అన్నది తెలియాల్సి ఉంది. శ్రీముఖి పెళ్లిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి శ్రీముఖి పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications