వారితో అసోసియేట్ అవ్వడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందన్న యాంకర్ సుమ..

తెలుగు రాష్ట్రాల ప్రజలకు యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా కుటుంబంలో అందరూ సుమకి ఫ్యాన్స్ అని నిర్మొహమాటంగా చెప్పొచ్చు. కాగా సీరియల్స్ ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన సుమ... దాదాపు 15 ఏళ్లుగా తన యాంకరింగ్ తో అలరిస్తుంది. పేరుకి మలయాళీ అయినప్పటికీ తెలుగింటి అమ్మాయి లాగా ప్రజలను మెప్పిస్తుంది. బుల్లితెరపై, సినిమా ఫంక్షన్ల లోనూ తనదైన శైలిలో దూసుకుపోతూ టాప్ యాంకర్ గా కొనసాగుతున్నారు సుమ.

అయితే కేవలం యాంకరింగ్ మాత్రమే కాకుండా సహాయ కార్యక్రమాల్లోనూ తన వంతుగా పాల్గొంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆమె వాఘ్ బక్రీ టీ గ్రూప్ అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తోన్నారు. హైదరాబాద్, నెల్లూరు ప్రాంతాల్లో ఉన్న దాదాపు 205కు పైగా అంగన్‌వాడీల్లో ఉన్న 10,500 మందికి పైగా విద్యార్ధులకు న్యూట్రీషన్ ఉన్న ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ఈ సంస్థ పని చేస్తోంది. ఇప్పుడు ఈ సంస్థ వాఘ్ బక్రీ ఫౌండేషన్‌తో కలిసి అక్షయ పాత్ర ఫౌండేషన్ కు 9 ఫుడ్ డెలివరీ వాహనాలను డొనేట్ చేసింది.

anchor-suma-shocking-post-about-wagh-bakri-foundation

ఇక ఇప్పుడు డొనేట్ చేసిన 9 వాహనాలతో కలిపి మొత్తంగా 32 వాహనాలను ఫుడ్ డెలివరీ కోసం దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కాకుండా.. గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, సహా పలు రాష్ట్రాల్లో ఈ ఫుడ్ డెలివరీ వాహనాలు అందుబాటులో ఉన్నాయని వాఘ్ బక్రీ టీ గ్రూప్ సంస్థ అధినేత సంజయ్ సింగాల్ వెల్లడించారు. మరోవైపు వాఘ్ బక్రీ టీ గ్రూప్ తీసుకున్న నిర్ణయాన్ని సుమ కనకాల సైతం ప్రశంసించారు. వాఘ్ బక్రీతో అసోసియేట్ అవ్వడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. అక్షయ్ పాత్ర ఫౌండేషన్‌కు వాహనాలను అందించడం మంచి విషయమని ప్రశంసించారు.

పీఎం పోషన్ పథకంలో భాగంగా అక్షయ్ పాత్ర ఫౌండేషన్ పిల్లలకు మంచి ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పని చేస్తోంది. ఇప్పటికే 16 రాష్ట్రాల్లోని 22 లక్షల మందికి పైగా విద్యార్ధులకు ఆహారం చేరవేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ అక్షయ పాత్ర ఫౌండేషన్ సేవలు కొనసాగుతున్నాయి. మరోవైపు సుమ చివరగా జయమ్మ పంచాయతీ సినిమాలో నటించగా.. ఆమె భర్త రాజీవ్ కనకాల తెలుగులో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అలానే వీరి కుమారుడు రోషన్ సైతం హీరోగా సినిమాలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+