నన్ను ఇంత మోసం చేస్తారనుకోలేదు..యాంకర్ సుమ సంచలన కామెంట్స్
యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఆమె తెలుగు అమ్మాయి కాకపోయినా ఆమె అంత బాగా మరే ఇతర తెలుగు యాంకర్ షోస్ చేయలేదు అన్నట్టుగా ఆమె తనదైన మార్క్ సృష్టించుకుంది. సందర్భం ఏదైనా, వేదిక ఎక్కడైనా.. మైక్ పట్టుకుంటే చాలు తన మాటల సవ్వడితో అందరినీ మైమరిపిస్తుంది. స్పాంటేనియస్ గా పంచులు వేయడమే కాదు.. ఎదుటి వాళ్ల పంచల్ కు వెంటనే రివర్స్ కౌంటర్ ఇవ్వడం ఈ యాంకరమ్మ స్టైల్. ఎప్పుడూ కూల్ గా నవ్వుతూ, నవ్విస్తూనే ఉంటారు సుమ.
కేరళ అమ్మాయి అయినప్పటికి, తెలుగు అనర్గళంగా మాట్లాడుతూ స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. చేసేది ఏ షో అయినా, అక్కడున్నది స్టార్ హీరోనైనా అందరి కళ్లు తనవైపు తిప్పుకునేలా చేయడంలో సుమ సిద్ధహస్తురాలు. ఇంకా చెప్పాలంటే స్టార్ హీరోలందరికి కూడా బెస్ట్ యాంకర్‌గా సుమ నిలిచిపోయారంటే ...ఆమె క్రేజ్ ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. యంగ్ హీరోలు సైతం సుమను అభిమానిస్తుంటారు.ఆ మధ్య మీడియా వాళ్ల గురించి సరదాగా మాట్లాడింది కూడా సీరియస్ కావడంతో వెంటనే క్షమాపణలు చెప్పిన గొప్ప గుణం ఆమె సొంతం.

ఎప్పుడూ కూల్‌గా నవ్వుతూ, నవ్విస్తూ ఉంటుంది. అలాంటి సుమ తనని ఓ వ్యక్తి మోసం చేశాడంటూ మీడియాకు ఎక్కారు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా యాంకర్ సుమ, తాజాగా ఓ సినిమాలో నటించారు.
ప్రియదర్శి, ఆనంది జంటగా నటిస్తున్న ప్రేమంటే సినిమాలో యాంకర్ సుమ కీలకపాత్ర పోషించారు. తాజాగా ఈ మూవీ టీజర్ ఈవెంట్‌లో సుమ సరదాగా మాట్లాడారు. సుమ మాట్లాడుతూ.. ఎప్పుడూ మనమే ప్రోగ్రాం స్టార్ట్ చేస్తుంటాం.. కానీ ఈసారి యాంకర్ గీత నాకు రావాల్సిన చెక్కు కొట్టేసింది.
మొదట ఈ సినిమాలో నన్ను ప్రియదర్శి పక్కన హీరోయిన్ అని చెప్పారు. కానీ ప్రియదర్శి వయసు నాకంటే తక్కువ కావడంతో డైరెక్టర్ వద్దని చెప్పారు. ఆ తర్వాత పవర్ ఫుల్ కానిస్టేబుల్ అని చెప్పి తీసుకున్నారు. సినిమాలో ఓ సీన్ చేశాక. పవర్ ఫుల్ కానిస్టేబుల్ కాదు.. పవర్ లెస్ కానిస్టేబుల్ అని తేలింది.
నన్ను ఇంత మోసం చేస్తారనుకోలేదు. దర్శకుడిపై వెంటనే కేసు పెట్టాలనుకున్నాను. కానీ కుర్రాడికి ఇంకా పెళ్లి కాలేదని తెలిసి వదిలేశాను. పెళ్లి చేసుకుంటే అంతకన్నా పెద్ద కేసు ఇంకోటి ఏముంటుంది. గ్లామర్ విషయానికి వస్తే.. హీరోయిన్ ఆనంది కంటే నేనే ఎక్కువ గ్లామర్‌గా కనిపించానని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో హుక్ స్టేప్ వేశాను అంటూ సరదాగా స్పీచ్ ఇచ్చింది సుమ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications