యాంకర్.. Bigg Boss లో నయా అవతార్
బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 10 అత్యంత కోలాహలంగా ప్రారంభమైంది. హోస్ట్ అక్కినేని నాగార్జున తనదైన శైలితో షోను నడిపించాడు. ప్రేక్షకులను మరోసారి టీవీ స్క్రీన్లకు కట్టిపడేశాడు. సినీ, టీవీ రంగానికి చెందిన ప్రముఖులు, గ్లామరస్ యాంకర్లు, సోషల్ మీడియా స్టార్లతో పాటు ఈ దఫా కామనర్లకు కూడా హౌస్‌లో చోటు దక్కింది. ప్రముఖ టీవీ నటుడు ముఖేష్ గౌడ చివరి కంటెస్టెంట్‌గా రాకతో ఈ సీజన్ కంటెస్టెంట్ల తుది జాబితా పూర్తయింది.
టీవీ వీక్షకులకు సుపరిచితుడు. ముఖేష్ గౌడ. ఈ సీజన్ లో 16వ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. అతని ఎంట్రీతో ఈ సీజన్‌కు సంబంధించిన 16 మంది కంటెస్టెంట్లపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. తన నటన ద్వారా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ముఖేష్.. బిగ్ బాస్ వేదికపై ఎలాంటి ఆటతీరుతో ప్రేక్షకులకు దగ్గరవుతారనేది వేచి చూడాలి.

టాప్ యాంకర్, మోడల్ వర్షిణి సౌందరరాజన్ 14వ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ ప్రారంభానికి ముందు నుంచి సోషల్ మీడియాలో ఆమె పేరు మార్మోగింది. ఊహించిన విధంగానే ఆమె గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తన గ్లామర్ తో ఇప్పటికే పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న వర్షిణి.. ఈ సీజన్‌లో టైటిల్ రేసులో బలమైన కంటెస్టెంట్ అవుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.
అగ్నిపరీక్ష ద్వారా ఎంపికైన కామనర్ గా రోహిత్.. 15వ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ప్రవేశించాడు. ఎటువంటి సినీ లేదా బుల్లితెర బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, ప్రతిభ ఆధారంగా హౌస్‌లోకి వెళ్లాడీ యంగ్ స్టర్. తన సహజ వ్యక్తిత్వంతో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటారనేది ఆసక్తికరం. హౌస్‌లోని సెలబ్రిటీలతో రోహిత్ ఎలా తలపడతారనేది ఈ సీజన్‌లో ప్రత్యేక ఆకర్షణ కానుంది.
A graceful entry into BIGG BOSS Season 10 🔥
— Starmaa (@StarMaa) September 6, 2026
House lo #Varshini aata modhalupedithe ela untundho chudadaniki siddama? 👁️
Watch the Grand Launch of #BiggBossSeason10, Playing Now only on #StarMaa#BiggBossTelugu10 #BiggBossTelugu10GrandLaunch pic.twitter.com/vEyxUlWO6D
మొత్తం మీద 16 మంది భిన్న మనస్తత్వాలు కలిగిన కంటెస్టెంట్లతో బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ సుదీర్ఘ ప్రయాణం మొదలైంది. హోస్ట్ అక్కినేని నాగార్జున సమక్షంలో ముగిసిన ఈ ఆరంభ వేడుక ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందించింది. రానున్న వంద రోజులకు పైగా సాగే ఈ ప్రయాణంలో హౌస్ లోపల జరిగే టాస్కులు, గ్రూపులు, ఎలిమినేషన్లు, ఎమోషన్లు.. ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటాయో తెలుసుకోవాలంటే ప్రతిరోజూ వీక్షించాల్సిందే.
Thana aatatho Agnipariksha ni jayinchi, Maha Sangramamloki adugu pettina #Rohit 🔥
— Starmaa (@StarMaa) September 6, 2026
Commoner ga BIGG BOSS lo charitra srushtisthada?👁️
Watch the Grand Launch of #BiggBossSeason10, Playing Now only on #StarMaa#BiggBossTelugu10 #BiggBossTelugu10GrandLaunch pic.twitter.com/2dagN4HbVO












Click it and Unblock the Notifications