యాంకర్ విష్ణుప్రియకి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు??
యాంకర్ విష్ణు ప్రియ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. పోవే పోరా అనే షో ద్వారా ఆడియన్స్ కు పరిచయమైన ఈ ముద్దగుమ్మ మంచి పాపులారిటీ పొందింది. తన యాంకరింగ్, అందాలతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతకు ముందు టెలివిజన్‌లో వరుస షోల ద్వారా ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు.. ఆ తర్వాత బిగ్ బాస్ షో లోకి కూడా ఎంట్రీ ఇచ్చి మరింత చేరువైంది. కానీ బిగ్ బాస్ షో లో పృథ్వీతో ప్రేమాయణం కొనసాగించడం అంత హాట్ టాపిక్ గా మారింది.
కాగా ఈ అమ్మడుకి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది. గతంలో అందాలను ఆరబోస్తూ గ్లామర్ ఫోటోషూట్‌లతో నెట్టింట హీట్ పెంచింది. అయితే రీసెంట్ గానే ఇన్‌స్టాగ్రామ్ లో 'సబ్‌స్క్రిప్షన్స్' షురూ చేసింది. గతంలో ఇన్ స్టా అంటే ఫోటోలు చూసి 'లైక్' కొట్టి నచ్చిన వారికి షేర్ చేస్తూ మెసేజెస్, కాల్స్ చేసుకునే ప్లాట్‌ఫామ్. కానీ ఇప్పుడు 'సబ్‌స్క్రిప్షన్స్' అనే కొత్త ట్రెండ్ వచ్చాక, ఫాలో అవ్వడం ఒక్కటే సరిపోదు.. "కంటెంట్ చూడాలంటే కప్పం కట్టాలి" అనే రేంజ్‌కి వెళ్ళిపోయింది. భాషతో సంబంధం లేకుండా పలువురు ఇన్‌ఫ్లుయెన్సర్స్ చేసే గ్లామర్ షో చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. అయితే ఈ వ్యవహారంలో విష్ణు ప్రియకి బిగ్ షాక్ తగిలింది.

విష్ణుప్రియ భీమినేనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ నాయకులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సాయికుమార్ తదితరులు సూర్యారావుపేటలోని సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు షోల్లో అందరినీ నవ్వించే విష్ణుప్రియ.. కాసులకు కక్కుర్తి పడి అర్ధనగ్న వీడియోలు చేస్తున్నారని విమర్శించారు. ఇతరులకు ఆదర్శంగా నిలవాలి కానీ.. ఇలా ప్రకటనలు చేసి సమాజానికి ఏం సందేశం ఇస్తోందని ఏఐఎస్‌ఎఫ్ ప్రశ్నించింది. వెంటనే విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను బ్లాక్ చేసి, క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కాగా కొందరు ఆమె వ్యక్తిగత స్వేచ్ఛగా భావించి మద్దతు తెలుపుతుండగా, మరికొందరు ఇలాంటి కంటెంట్ యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ వివాదంపై విష్ణుప్రియ నుంచి అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు. అయితే ఇలాంటి వివాదాలు సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలకు కొత్తేమీ కాదని, ఫేమ్‌తో పాటు విమర్శలు కూడా సహజమని విశ్లేషకులు చెబుతున్నారు.
Vishnu priya Dropped another banger at exclusive 🥶
— Karthi (@its_Karthi26) April 6, 2026
A thread 🧵 pic.twitter.com/o8SuD6jI0Z












Click it and Unblock the Notifications