డిజాస్టర్ హీరో, ఐరన్ లెగ్ హీరోయిన్ తో అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా..?
చాలామంది దర్శకులు హిట్ కోసం ఎదురు చూస్తుంటారు. ఒక్క హిట్ కొట్టినా లైఫ్ సెటిల్ అని భావిస్తుంటారు. అయితే టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్రం ఒకటి కాదు రెండు కాదు వరుసగా 9 సినిమాలు హిట్ కొట్టాడు. మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ తొలి వారంలో రూ. 292 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. దీంతో బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏంటో మరోసారి రుజువైంది. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. అలాగే విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో మెరిశారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల మైలురాయి దిశగా దూసుకెళ్తోంది. విడుదలైన అన్ని చోట్ల హౌజ్ ఫుల్ షోస్ తో దూసుకెళ్తోంది.
అయితే ఇక అనిల్ రావిపూడి నెక్ట్స్ మూవీ ఎవరితో తీస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, నందమూరి బాలకృష్ణతో సినిమాలు చేశాడు. ఇక అక్కినేని నాగార్జునతోనూ సినిమా చేయాలని ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఇదే విషయంపై అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో అనిల్ ను ట్యాగ్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. దీనిపై ఇటీవల అనిల్ రావిపూడి మాట్లాడుతూ నాగార్జునతో హలో బ్రదర్ లాంటి సినిమా చేస్తానని తెలిపాడు.

అయితే అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాను అక్కినేని అఖిల్ తో చేయనున్నట్లు సమాచారం అందుతోంది. అఖిల్ కెరీర్ ను మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ అతడి కెరీర్ లో ఒక్క క్లీన్ హిట్ కూడా లేదు. అఖిల్ గత చిత్రం ఏజెంట్ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఈ క్రమంలో అఖిల్ కు హిట్ కోసం అనిల్ రావిపూడి కరెక్ట్ అని నాగార్జున ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా శ్రీలీల నటించబోతుందని టాక్. శ్రీలీలకు కూడా సరైన హిట్ రాలేదు. ఆమె నటించిన గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్లాఫ్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో అఖిల్- శ్రీలీల కాంబినేషన్ లో అనిల్ రావిపూడి హిట్ కొడతాడో లేదో చూడాలి..












Click it and Unblock the Notifications