'జవాన్' రికార్డును బద్ధలు కొట్టిన 'యానిమల్'
సందీప్ రెడ్డి వంగా లేటెస్ట్ మూవీ యానిమల్ బాక్సాఫీస్ ని రఫ్ఫాడిస్తోంది. డిసెంబరు 1న ఈ సినిమా విడుదలైంది. డ్రై సీజన్ లో కూడా వసూళ్ల వర్షం కురిపిస్తుండటంపై సినిమా విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా మూడోవారంలో కూడా మంచి కలెక్షన్లను రాబడుతూ అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. దాదాపు రూ.850 కోట్లకు దగ్గరలో ఉంది.
ఏ రేటెడ్ సినిమా... అందులోను మూడున్నర గంటల నిడివితో ఉన్న సినిమా ఈ స్థాయిలో కలెక్షన్లు వసూలు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. సినిమా హిట్ అవుతుందని అనుకున్నారుకానీ ఈస్థాయిలో హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఫైనల్ రన్ లో ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందనేది చూడాలి. డంకీ, సలార్ సినిమాలు ఈనెల 21, 22 తేదీల్లో థియేటర్లలోకి అడుగుపెడుతున్నాయి. అంటే యానిమల్ కు మరో మూడు రోజులు మాత్రమే థియేటర్లలో రన్ ఉంది.

వెయ్యికోట్ల రూపాయల మార్క్ ను అందుకుంటే ఈ సినిమా కొత్త చరిత్ర సృష్టించినట్లవుతుంది. అంతేకాదు.. ఓవర్సీస్ లో ర్యాంపేజ్ క్రియేట్ చేస్తోంది. జవాన్ ఫైనల్ కలెక్షన్స్ ను బీట్ చేసి కొత్త బెంచ్ మార్క్ సృష్టించింది. కెనడాలో షారుఖ్ సినిమాలకి భీభత్సమైన కలెక్షన్స్ వస్తుంటాయి. జవాన్ సినిమా కెనడాలో 5.2 మిలియన్స్ ని వసూలు చేసింది. ఈ కలెక్షన్స్ ని బీట్ చేసి యానిమల్ సినిమా 5.5 మిలియన్ డాలర్స్ కి దగ్గరలో ఉంది. కెనడాలో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఓవరాల్ గా యుఎస్ మార్కెట్ లో యానిమల్ 15 మిలియన్ మార్క్ ని రీచ్ అవనుంది. ఈ సినిమాకు కొనసాగింపుగా యానిమల్ పార్క్ ఉన్నట్లు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే తెలిపారు.












Click it and Unblock the Notifications