బోల్డ్ సీన్స్ తో అంజలి అందాల రచ్చ... ఓటీటీని ఊపేస్తోన్న బహిష్కరణ!!

సినిమాలతో ప్రస్తుతం వెబ్ సిరీస్ లు పోటీ పడుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే సినిమాలకంటే వెబ్ సిరీస్ లే బాగున్నాయని చాలా సందర్భాలలో జనాలు చర్చిస్తున్న పరిస్థితి ఉంది. ఓటీటీ వేదికగా అందుబాటులోకి వస్తున్న వెబ్ సిరీస్ లు సినిమాల కంటే ఎక్కువగా టాప్ ఆఫ్ ది టౌన్ అవుతున్నాయి. ఇక తాజాగా ఓటీటీలో అంజలి నటించిన బహిష్కరణ వెబ్ సిరీస్ రచ్చ రేపుతోంది.

బోల్డ్ సీన్స్ లో అదరగొట్టిన అంజలి
అంజలి, అనన్య నాగళ్ళ, శ్రీ తేజ, రవీంద్ర విజయ్, షణ్ముఖ్, మెహబూబ్ భాషా తదితరులు నటించిన, ముఖేష్ ప్రజాపతి స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన బహిష్కరణ వెబ్ సిరీస్ ప్రస్తుతం ఓటీటీ జి ఫైవ్ లో స్ట్రీమింగ్ అవుతూ రచ్చ చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో అంజలి వేశ్య పాత్రలో బోల్డ్ సీన్స్ లో అదరగొట్టింది.

Anjali shocked with her beauty in bold scenes bahishkarana web series shaking OTT

జీ5లో టాప్ ట్రెండింగ్ లో బహిష్కరణ
ప్రస్తుతం జీ ఫైవ్ లో ఈ వెబ్ సిరీస్ టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. పిరియాడికల్ రివెంజ్ స్టోరీ తో రూపొందించిన ఈ వెబ్ సిరీస్ కు అంజలి నటన హైలెట్ అని చెప్పవచ్చు. ఈ వెబ్ సిరీస్ కథ పాతది అయినప్పటికీ ఇందులో అంజలి నటించిన తీరు, మోతాదుని మించిన బోల్డ్ సీన్స్ లో అంజలి అందాల రచ్చ బహిష్కరణ హిట్ అవడానికి ప్రధాన కారణంగా మారింది.

వేశ్యగా బోల్డ్ పాత్రలో నటించిన అంజలి
ఒకప్పుడు ఊరికి పెద్ద మనుషులు ఎలా ఉండేవారు? ఊరికి పెద్ద మనుషులుగా చలామణి అయ్యేవారు ఎటువంటి దారుణాలకు పాల్పడేవారు? వారు మహిళలను ఏ విధంగా హింసించేవారు అనేది? ఈ వెబ్ సిరీస్ లో చూపించే ప్రయత్నం చేశారు. ఒక వేశ్యగా బోల్డ్ పాత్రలో నటించడం అంజలికి నిజంగా చాలెంజ్ అని చెప్పాలి. వేశ్యగా, ప్రియురాలిగా రెండు పాత్రలలోను అంజలి ఒదిగిపోయారు.

శృంగార భరిత సన్నివేశాలలో అంజలి నటన హైలెట్
రెండు విభిన్న కోణాలు ఉన్న పాత్రలను పుష్ప క్యారెక్టర్ లో అంజలి చాలా గొప్పగా చూపించారు. ఈ వెబ్ సిరీస్ లో శృంగార భరిత సన్నివేశాలలో అంజలి నటన వెబ్ సిరీస్ సక్సెస్ కు ఒక కారణమని చెప్పాలి. ఏది ఏమైనా ఇటీవల కాలంలో ఓటీటీ లో వచ్చే వెబ్ సిరీస్ లలో చాలా సన్నివేశాలను పచ్చిగా చిత్రీకరిస్తున్న తీరు బహిష్కరణ వెబ్ సిరీస్ లోను కనిపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+