చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..!

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నొవా వార్తల్లో నిలిచారు. లేటెస్ట్ గానే ఆమె సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ ఓపెన్ చేశారు. దీంతో ఆమెకు పవర్ స్టార్ కూడా ప్రత్యేకంగా విష్ చేశారు. ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా.. మెగా ఫ్యామిలీ కూడా ఆమెకు స్వాగతం పలుకుతూ వెల్ కమ్ తెలిపారు. అంతే కాకుండా మెగా అభిమానులు సైతం పవన్ తో పాటు ఆమె ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ ట్యాగ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా ఆమెకు స్వాగతం చెబుతూ.. ''అన్నా.. ఇన్‌స్టాగ్రామ్‌లోకి మీకు స్వాగతం పలుకుతున్నాను. ఇక్కడ మీకు ఎంతో ప్రేమ దక్కాలని కోరుకుంటున్నాను'' అని తన ఇన్‌స్టా స్టేటస్‌లో తెలిపారు. దీనికి అన్నా లెజ్నొవా స్పందిస్తూ..''మీ సపోర్ట్‌కు ధన్యవాదాలు అన్నయ్యా'' అంటూ రాసుకొచ్చారు. అయితే అన్నా స్పందనపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. కొందరు ఆమెకు మద్దతుగా బావగారు అంటే తండ్రి లేదంటే అన్నయ్యతో సమానం కాబట్టి అలా వ్యాఖ్యానించి ఉండవచ్చని అంటుంటే.. మరి కొందరు మాత్రం బావ గారు అనాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక దీనిపై అన్నా మరోసారి రియాక్ట్ అవుతూ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

anna-lezhneva-wife-of-pawan-kalyan-clarity-post-on-megastar-chiranjeevi-and-nagababu-calling-annayya

ఏం పోస్ట్ చేశారంటే..?

దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం, నేను ఒక కుటుంబంలోకి వచ్చాను.. అక్కడ అప్పటికే అందరూ ఒకరికొకరు చెందినవారే. అక్కడ ఎలా ఇమడాలో నాకు తెలియలేదు. ఎవరిని ఏమని పిలవాలో కూడా తెలియలేదు. అందుకే మా ఆయన దగ్గర నుండి మాటలు నేర్చుకున్నాను. అన్నయ్య.. చిన్న అన్నయ్య.. మొదట్లో అది మాట మాత్రమే. కానీ కాలక్రమేణా, అది నాలో ఒక భావనగా మారింది. ఆ తర్వాత వారిని పిలవడానికి మరో మార్గం కూడా ఉందని తెలుసుకున్నాను.

కానీ అప్పటికి అది ఇక భాషకు సంబంధించిన విషయం కాదని అర్దం చేసుకున్నారు. నాకు అన్నయ్య లేడు. ఆ లోటును భర్తీ చేసేందుకు జీవితం నాకు ఇద్దరిని ఇచ్చింది అంటూ మెగాస్టార్ చిరంజీవిని, నాగ బాబును ట్యాగ్ చేశారు. దీంతో వదిన గుండెల్ని పిండేశావ్.. చాలా ఎమోషనల్ పోస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+