ఇకపై అలాంటి పనులు చేయను
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తాజా చిత్రం.. అన్నపురాణి. నీలేష్ కృష్ణ దర్శకుడు. జై, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించారు. థమన్ సంగీతాన్ని సమకూర్చారు. గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన విడుదలైందీ మూవీ. పెద్దగా జనాలను ఆకట్టుకోలేదు గానీ.. దీనిపై ఓ రేంజ్‌లో కాంట్రావర్సీ నడుస్తోంది.
లవ్ జిహాద్‌ను ప్రోత్సహించేలా సినిమాను చిత్రీకరించారనే వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. చెఫ్‌గా ఎదగాలనుకున్న ఓ బ్రాహ్మణ అమ్మాయి.. నాన్ వెంజ్ వంటకాలను వండటం, ముస్లిం యువకుడితో ప్రేమలో పడటం..అనే కథాంశాన్నీ మెజారిటీ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.

Recommended Video

ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తరువాత మరింత వివాదం చెలరేగింది. హిందూయిజాన్ని, బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఎన్నో అభ్యంతరకర సన్నివేశాలతో నిండిన అన్నపురాణి సినిమాను బ్యాన్ చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. దీనితో నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను ఓటీటీ నుంచి తొలగించింది. అక్కడితో వివాదానికి తెర పడలేదు.
దీనిపై తాజాగా నయనతార స్పందించారు. బహిరంగ లేఖను రాశారు. అన్నపురాణి సినిమాపై వచ్చిన వివాదాలపై బరువెక్కిన హృదయంతో స్పందిస్తోన్నానని పేర్కొన్నారు. యువతలో స్ఫూర్తిని పెంచే విధంగా కథాంశాన్ని ఎంచుకున్నామని, అదే స్థాయిలో సినిమా చిత్రీకరణ జరిగిందని గుర్తు చేశారు.

సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వాలనేదే ఈ సినిమా ఉద్దేశం తప్ప, వివాదాలను రేకెత్తించాలనేది తమ అభిమతం కాదని నయనతార వివరణ ఇచ్చారు. సినిమా కథాంశం కొంతమంది మనోభావాలు దెబ్బతీసి ఉండొచ్చని, ఫలితంగా దీన్ని ఓటీటీ నుంచి తొలగిస్తారని ఊహించలేదని చెప్పుకొచ్చారు.
ఒకరి మనోభావాలను దెబ్బ తీయాలనుకోవట్లేదని, వివాదం తీవ్రతను అర్ధం చేసుకున్నామని వ్యాఖ్యానించారు. భగవంతుడిని అంతఃకరణశుద్ధితో విశ్వసించే భక్తురాలిగా, క్రమం తప్పకుండా దేవాలయాలకు వెళ్లే మహిళగా.. ఇకపై ఇలాంటి సినిమా చేయబోనని అన్నారు. మనోభావాలు దెబ్బతిన్న వారందరికీ హృదయ పూరక క్షమాపణలు తెలియజేస్తోన్నానని పేర్కొన్నారు.

అన్నపురాణి సినిమా ఉద్దేశం స్ఫూర్తినింపడమే కానీ బాధ పెట్టడం కాదని స్పష్టం చేశారు. తన 20 సంవత్సరాల సినీ ప్రయాణంలో అందరికీ పాజిటివ్ ఎనర్జీని ఇవ్వాలనే ఉద్దేశంతో కేరీర్ కొనసాగిస్తోన్నానని నయనతార అన్నారు.
-
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
ఓటీటీలో జనాలు ఎగబడి చూస్తున్న సినిమా ఇదే.. మీరు చూశారా? -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే












Click it and Unblock the Notifications