రాజ్ తరుణ్ ప్రియురాలుపై కత్తితో దాడి
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. లావణ్య అనే యువతి హీరో రాజ్ తరుణ్ తనని మోసం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్‌తో 11 ఏళ్ల నుంచి రిలేషన్ ఉన్నానని ..తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పి పెద్ద షాకిచ్చింది. మధ్యలో ఓ హీరోయిన్ రావడంతో ఆమెతో ఎఫైర్ పెట్టుకుని వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ నాకు కావాలని తాను ఆయనతోనే ఉండాలని కోరుకుంటానని లావణ్య స్పష్టం చేసింది.
హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ నడుపుతున్న రాజ్ తరుణ్ నన్ను వదిలించుకోవాలని చుస్తున్నాడని.. శారీరకంగా వాడుకుని మోసం చేశాడని లావణ్య తెలిపింది. గుడిలో మాకు రహస్య వివాహం జరిగిందని.. రాజ్ తరుణ్ రెండుసార్లు అబార్షన్ కూడా చేయించాడని లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. రాజ్ తరుణ్‌కు చాలా మంది అమ్మాయిలతో రిలేషన్స్ ఉన్నాయని తెలిపింది. దీనిలో భాగంగానే బిగ్ బాస్ బ్యూటీ అరియానాతో రాజ్ తరుణ్ ఎఫైర్ నడిపాడాని ఆరోపించింది.

లావణ్య చేసిన ఆరోపణలపై రాజ్ తరుణ్ స్పందించారు. నేను ఒకప్పుడు లావణ్యతో రిలేషన్‌తో ఉన్న మాట వాస్తవమేనని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. అయితే 2016-17 తర్వాత ఆమెతో తనకు ఎటువంటి శారీరక సంబంధం లేదని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు. ఆమె వ్యక్తిత్వం మంచిది కాదనే దూరంగా ఉన్నానని, ఇండస్ట్రీలో ఉన్న నాకున్న పరువు పోతుందనే ఇన్నాళ్లు తాను సైలెంట్‌గా ఉన్నానని రాజ్ తరుణ్ తెలిపారు.
ఇదిలా ఉంటే తాజాగా హీరోయిన్ మాల్వి మల్హోత్రాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. గతంలో మాల్వి మల్హోత్రా అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేష్‌తో ఎఫైర్ నడిపిందనే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కొన్నాళ్లు బాగనే సాగిన వీరి రిలేషన్ అభిప్రాయభేదాలు రావడంతో బ్రేకప్ అయిందని తెలుస్తోంది. అయితే మాల్వి మల్హోత్రా తనను మోసం చేసిందని భావించిన ఆమె కత్తితో దాడి చేశాడు.
ఈ దాడిలో మాల్వి మల్హోత్రా గాయాలపాలైంది. యోగేష్ మర్డర్ అటెంప్ట్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇటీవలే మాల్వి మల్హోత్రాపై యోగేష్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాల్వి మల్హోత్రా ప్రేమ పేరుతో నా కొడుకు యోగేష్ ని ట్రాప్ చేసింది. మా ఆస్తులు కాజేసి, జైలుపాలు చేసిందని ఫిర్యాదులో పేర్కొంది. గతంలో యోగేష్-మాల్వి మల్హోత్రా మధ్య సాగిన ఆడియో, వీడియో కాల్స్‌కి సంబంధించిన డేటాను సైతం ఆమె పోలీసులకు అందజేసినట్టు తెలుస్తోంది. దీంతో మాల్వి మల్హోత్రాపై రెండో కేసు నమోదైనట్టు అయింది.












Click it and Unblock the Notifications