నా భర్తకి వేరే అమ్మాయితో ఎఫైర్...విడాకులు ఇప్పించండి ప్లీజ్..!
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేకుండాపోయింది. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. కలిసి ఉండలేక స్టార్స్ ఇలా విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి.
భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. సూపర్ స్టార్లు సైతం తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. తాజాగా ఈ జబితాలోకి మరో సూపర్ స్టార్ జంట వచ్చి చేరింది. బాలీవుడ్ స్టార్ సింగర్ యో యో హనీ సింగ్ తెలియని సినీ అభిమాని ఉండరు. ఆయన తన పాటలతో అభిమానులను అలరించారు. ముఖ్యంగా ర్యాప్ మ్యూజిక్‌కు సూపర్ క్రేజ్ తీసుకువచ్చిన ఘనత హనీ సింగ్‌కే దక్కుతుంది. అయితే హనీ సింగ్ వైవాహిక జీవితం ఒడిదుడుకులకు లోనైందనే చెప్పాలి.

2011లో శాలిని తల్వార్‌ని పెళ్లి చేసుకున్న హనీ సింగ్..10 ఏళ్ల పాటు ఆమెతో కాపురం చేశాడు. మొదట్లో వీరి కాపురం బాగానే సాగింది. తరువాత వీరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. నిత్యం గొడవలతో మీడియాకు కూడా ఎక్కడంతో..2021 నుంచి ఈ జంట దూరంగా ఉంటున్నారు.ఆ తరువాత శాలిని తల్వార్ భర్త తనని వేధిస్తున్నాడని హనీ సింగ్‌పై గృహహింస చట్టం కేసు పెట్టింది.

ఆ సమయంలోనే తన భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉందని శాలిని తల్వార్ తన భర్తపై సంచలన ఆరోపణలు చేసింది. ఆ కారణంతోనే 2021లో కోర్టును ఆశ్రయించిన శాలిని తల్వార్ భర్త నుంచి విడాకులు కావాలని అపీల్ చేసింది. తాజాగా ఢిల్లీ కోర్టు హనీ సింగ్‌కు విడాకులు మంజూరు చేసింది. హనీ సింగ్‌ని తన భార్యకు భరణం ఇవ్వాల్సిందిగా కోర్టు చెప్పగా..ఈక్రమంలోనే తన భార్య శాలినికి హనీ సింగ్ కోటి రూపాయల చెక్కు ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తనికి మరో స్టార్ విడాకులు తీసుకోవడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications