మీనాక్షి చౌదరిని దారుణంగా మోసం చేసిన స్టార్ హీరో
సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే మచ్చ ఏసుకునే పుట్టాలి. ఇండస్ట్రీలో చాలామంది నటులు, నటీమణులు టాలెంట్ ఉన్నా అదృష్టం లేక ఫేడ్ అవుట్ అవుతున్నారు. అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్ ఉండి కూడా ఏమాత్రం అదృష్టం లేని జాబితాలో తాజాగా హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా చేరిందనే చెప్పాలి. ఒకే ఒక సినిమాతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది మీనాక్షి చౌదరి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ , మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది.
అంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కలేదు. గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా చేసిన కూడా ఈ సినిమా ఆమెకు ఫుల్ పాపులారిటీ తెచ్చి పెట్టింది. మీనాక్షి చౌదరి తెలుగులో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోంది.అయినప్పటికి కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా కొట్టింది లేదు. తాజాగా తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్‌తో 'గోట్' అనే మూవీలో నటించింది. ఈ సినిమా ఫలితం మీనాక్షి చౌదరికి నిరాశనే ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద 'గోట్' మూవీ నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్స్ వస్తున్నాయి.

దీనికి తోడు సినిమాలో మీనాక్షి చౌదరి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని తేల్చేశారు. 'గోట్' మూవీ తన కెరీర్‌కు ఉపయోగపడుతుందని భావించిన మీనాక్షి చౌదరికి మరోసారి నిరాశ తప్పలేదు. ఇప్పటికే మహేష్ బాబు సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో నటించి తప్పు చేసిన మీనాక్షి చౌదరి , ఇప్పుడు విజయ్ సినిమాలో సైతం ఇలాంటి పాత్రే పోషించి తప్పు చేసిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ తమిళ స్టార్ హీరో కూడా మీనాక్షి చౌదరికి హిట్ ఇవ్వలేకపోయారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మీనాక్షి చౌదరి ప్రస్తుతం చిరంజీవి సినిమాలో నటిస్తోంది.
చిరంజీవి ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి దేవకన్యలా కనిపించనుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. దీంతో పాటు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది ఈ హాట్ బ్యూటీ. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా, సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దళపతి విజయ్ నటిస్తున్న సినిమాలో కూడా మీనాక్షి చౌదరినే హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం అందుతుంది. 'లక్కీ భాస్కర్', 'మట్కా', హీరో వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీలో కూడా నటిస్తుంది. మరి ఈ సినిమాలైన మీనాక్షి చౌదరి కెరీర్‌కు ఉపయోగపడుతాయో లేదో చూడాలి.
-
మౌళి "దొంగనా కొడుకు".. మైత్రీ మూవీస్ సంచలన ప్రకటన..!! -
ఇదేం టీజర్ రా బాబోయ్.. మహేష్ అన్నకొడుకు ఏడిపించాడు భయ్యా.. మరో ఆర్ఎక్స్ 100..! -
మళ్లీ వాయిదా.. "పెద్ది" మూవీ మరో 'హరిహర వీరమల్లు' కానుందా ??? -
ఆ స్టార్ హీరో నా క్లాస్ మెట్.. అన్నం పెట్టిన రోజుల్ని మర్చిపోలేను -
ఎన్టీఆర్ మూవీలో రామ్ చరణ్ హీరోయిన్.. నీల్ ప్లాన్ గట్టిగానే !! -
పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!! -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
పగలు మనిషి.. రాత్రి అయితే.. 'రాకా' లో అల్లు అర్జున్ క్యారెక్టర్ తెలిస్తే గూస్ బంప్స్..! -
అందరి ముందే నడుం గిల్లాడంటూ ఏడ్చేసిన తెలుగు బ్యూటీ.. -
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!!












Click it and Unblock the Notifications