ఆస్కార్ వేడుకల్లో 'ఆర్ఆర్ఆర్' కు అరుదైన గౌరవం.. న్యూ కేటగిరీ !
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటి చెబితే.. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఆ మూవీ ఎన్నో ఏళ్లగా తెలుగు సినిమా ఎదురుచూస్తున్న ఆస్కార్ కలను నిజం చేసింది. లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగిన 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ చిత్రం లోని 'నాటు నాటు' పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఉత్తమ పాటగా అవార్డును సొంతం చేసుకుంది. ఆస్కార్ తో పాటు గోల్డెన్ గ్లోబ్, సినీ క్రిటిక్స్ అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమాపై.. హాలీవుడ్ దిగ్గజాలు జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ ప్రశంసల వర్షం కురిపించారు.
అయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్రం మరో అరుదైన ఘనత సాధించింది. సినీ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ఆస్కార్ అగ్ర స్థానంలో ఉంది అనడంలో సందేహమే లేదు. ప్రతి నటుడు ఒక్కసారైన ఆస్కార్ అవార్డును గెలుచుకోవాలని కోరుకుంటారు. ఇప్పుడు ఈ అకాడమి అవార్డుల్లో తాజాగా కొత్త కేటగిరీ చేరనుంది. ఇకపై స్టంట్ డిజైన్ క్యాటగిరి లోను ఆస్కార్ అవార్డును ఇవ్వనున్నట్టు అకాడమీ ప్రకటించింది. 2027 నుంచి విడుదలైన సినిమాలను ఎంపిక చేసి ఈ జాబితాలో అవార్డులు ఇవ్వనున్నట్టు వెల్లడించింది.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో .. సినిమా ప్రారంభం నుంచి స్టంట్ డిజైన్ అనేది చిత్ర నిర్మాణంలో ఒక భాగంగా ఉంది. ఈ సాంకేతికత, సృజనాత్మక కళాకారుల వినూత్న పనిని గౌరవించడం గర్వకారణమని రాసుకొచ్చారు. వారి నిబద్ధత, అంకితభావాన్ని అభినందిస్తున్నామని పేర్కొన్నారు. అయితే అందుకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు తెలుగు ప్రజల దృష్టిని బాగా ఆకర్షిస్తోంది.
ఆ పోస్టర్లో.. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్, ఆర్‌ఆర్‌ఆర్, మిషన్ ఇంపాజిబుల్ సినిమాల్లోని స్టంట్‌ల ఇమేజ్‌లపై స్టంట్ డిజైన్ ఆస్కార్ (Stunt Design Oscar) అంటూ రాసుకొచ్చారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి పొందిన ఆస్కార్ అవార్డుల్లో కొత్తగా ఒక కేటగిరీని చేర్చబోతుండడం.. అందుకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్ లో తెలుగు సినిమా ఉండడం అంటే మామూలు విషయం కాదంటూ చర్చ నడుస్తోంది. దీంతో ఈ పోస్టును తెగ షేర్ చేస్తూ తెలుగు మూవీ లవర్స్ అంతా కామెంట్స్ చేస్తున్నారు.
Stunts have always been part of the magic of movies. Now, they’re part of the Oscars.
— The Academy (@TheAcademy) April 10, 2025
The Academy has created a new annual award for Achievement in Stunt Design—beginning with the 100th Oscars in 2028, honoring films released in 2027. pic.twitter.com/lpHen9Qk9l












Click it and Unblock the Notifications