వాస్తవానికి 'పుష్ప2' అట్టర్ ఫ్లాప్... అంతా పబ్లిసిటీ స్టంట్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప2 సినిమా దేశవ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. తెలుగు ప్రేక్షకులకన్నా హిందీ ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. తెలుగులోకన్నా హిందీ వెర్షన్ లోనే ఈ సినిమాకు కలెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. అయితే సామాజికి మాధ్యమాల్లో ఈ సినిమాపై వ్యతిరేక ప్రచారం నడుస్తోంది. ఇది చేస్తుందెవరనేది తెలియకపోయినప్పటికీ వారు వ్యాప్తి చేస్తున్న వ్యతిరేక వీడియోలు మాత్రం వైరలవుతున్నాయి.

మిస్టర్ బచ్చన్ కు సంబంధించిన వీడియో అది
పుష్ప2 ప్రదర్శింపబడుతున్న థియేటర్ల వద్ద సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకుల నుంచి వీడియో తీసుకుంటున్నారు. కొందరు ఈ సినిమాను అట్టర్ ఫ్లాప్ అని చెప్పారని, బిలో యావరేజ్ అన్నారంటూ ఓ ప్రేక్షకుడు థియేటర్ దగ్గర చెబుతున్న వీడియోను కొందరు ట్వటర్ లో షేర్ చేశారు. సినిమా నాకు నచ్చలేదు.. ఇంకా ఆడుతోంది.. అయినా బయటకు వెళ్లిపోతున్నానంటూ చెప్పి వెళ్లిపోతాడు. అల్ట్రా డిజాస్టర్ అంటూ షేర్ చేస్తున్నారు. అయితే ఈ వైరలవుతున్న వీడియోలో కుడివైపు ఓ తెలుగు ఛానల్ లోగో ఉంది. దాన్ని గురించి శోధిస్తే అది ఆగస్టు 15వ తేదీన అప్ లోడ్ చేసిన వీడియో అని తేలింది. రవితేజ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాకు సంబంధించిన ప్రేక్షకుడి వీడియో అది.

anti publicity videos viral on allu arjun pushpa 2 movie

షారుక్ ఖాన్ సినిమాకు సంబంధించిన రివ్యూ అది
పుష్ప2కు సంబంధించి ఓ పెద్ద వయసున్న వ్యక్తి చెబుతున్న వీడియోను కూడా ట్విటర్ లో షేర్ చేశారు. అయితే అతను ఉడ్తా పంజాబ్ సినిమా గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ వీడియో గురించి కూడా శోధిస్తే వైరల్ బాలీవుడ్ డాట్ కామ్ లోగో ఉంది. వారి ఛానెల్ లో 2016లో దీన్ని అప్ లోడ్ చేశారు. అతను మాట్లాడినదాన్ని అల్లు అర్జున్ సినిమా గురించి మాట్లాడినట్లుగా చేసి పబ్లిక్ టాక్ కింద వైరల్ చేస్తున్నారు. ఇదంతా పూర్తి ఫేక్ అని తేలుతోంది. అంతేకాకుండా మరో వీడియోలో ఓ వ్యక్తి థియేటర్ తలుపులు ఎప్పుడు తెరుస్తారా? వెళ్లిపోదామని చూస్తున్నట్లుగా ఉందని చెబుతాడు. భూమి మీద ఉన్న సినిమాల్లో ఇదే అతి చెత్త సినిమా అని చెబుతాడు. ఇది కూడా అదే ఛానల్ కు సంబంధించి లోగోతో ఉంది. 2017లో దీన్ని అప్ లోడ్ చేశారు. జబ్ హ్యారీ మెట్ సెజల్ సినిమాకు సంబంధించిన రివ్యూను అతను చెబుతున్నాడు. ఇలాంటివన్నీ వైరల్ చేస్తూ పుష్ప2 సినిమాను ఫ్లాప్ అంటూ కొందరు ప్రచారం చేస్తుండటంపై బన్నీ అభిమానులు మండిపడుతున్నారు. సినిమా హిట్ కాదు.. అంటా పబ్లిసిటీ స్టంట్ అటూ ప్రచారం చేస్తున్నవారికి ఈ వీడియోలతో సమాధానం చెప్పినట్లైందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+