అల్లు అర్జున్ తో నటించి తప్పుచేశా: స్టార్ హీరోయిన్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే దేశంలోని అందరు హీరోయిన్లకు ఎంతో క్రేజ్ ఉంది. ఒక్క సినిమాలోనైనా అల్లుతో నటించాలని ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే అంత స్టైలిష్ గా ఉంటాడు కాబట్టింది. అవకాశం వచ్చిందంటే చాలు ఎగిరి గంతేస్తారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప2 సినిమా చేస్తున్నాడు. దీన్ని ఆగస్టు 15వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మైత్రీ మూవీమేకర్స్ నిర్మిస్తోంది. దేవిశ్రీప్రసాద్ స్వరాలందిస్తున్నారు.
అల్లు అర్జున్ తో నటిస్తే తమ క్రేజ్ ఎక్కడికో పోతుందని హీరోయిన్లంతా భావిస్తుంటారు. తర్వాత అవకాశాలు కూడా వస్తాయనే నమ్మకం ఉంటుంది. చిన్న చిన్న హీరోలతో చేసే రాని గుర్తింపు ఒక స్టార్ హీరోతో చేస్తే కచ్చితంగా వస్తుందనే ఆశతో ఉంటారు. సరిగ్గా అలాంటి స్ట్రాటజీనే అను ఇమ్మానుయేల్ ఫాలో అయింది. నాని కథానాయకుడిగా నటించి మజ్ను సినిమాతో తెలుగు పరిశ్రమలోకి ప్రవేశించింది. పవన్ కల్యాణ్ తో కూడా నటించింది. అల్లు అర్జున్ తో నాపేరు సూర్య.. నాఊరు ఇండియా సినిమాలో నటించింది.

ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఫ్లాప్ అవడానికి కారణం అనుయే అంటూ అల్లు అర్జున్ అభిమానులు భారీగా ట్రోల్ చేశారు. ఐరన్ లెగ్ అంటూ బాగా ఏడిపించారు. ఆ సమయంలో అను చాలా బాధపడిందంట. బుద్ధి లేక ఈ హీరోతో నటించానని, భవిష్యత్తులో చేయనని బాధపడిందంట. ఈ వార్త అప్పట్లో బాగా ట్రెండ్ అవగా సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారింది.
ప్రస్తుతం తెలుగులో అవకాశాలు లేక తమిళ సినిమాలకే పరిమితమైంది. భవిష్యత్తులో కూడా తెలుగులో అవకాశాలు వస్తాయనే నమ్మకం లేదంటున్నారు. పుష్ప2 చిత్రం తర్వాత అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు బన్నీ. అయితే కథ బాగోలేకపోవడంతో మరో కథను దర్శకుడు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప2 పూర్తయిన తర్వాత ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అప్పటికీ కుదరకపోతే త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసే అవకాశం ఉందంటున్నారు.












Click it and Unblock the Notifications