పవన్ కల్యాణ్‌కు షాకిచ్చిన అనుపమ పరమేశ్వరన్
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా యూత్‌లో అనుపమ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. తన అందం, నటన, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ కేరళ కుట్టి. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ..ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచియం అయిన అనుపమ పరమేశ్వరన్.. ఆ తరువాత యూత్‌ఫుల్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
రామ్, నాగ చైతన్య, నిఖిల్, నాని వంటి యంగ్ స్టార్స్‌తో ఈ అమ్మడు నటించింది. ప్రస్తుతం నాలుగైదు సినిమాలకుపైగానే అనుపమ చేతిలో ఉన్నాయంటే ఆమె డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా జోన్నలగడ్డ సిద్దుతో టిల్లు స్కైర్ సినిమాతో అనుపమ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. సిద్దు జోన్నలగడ్డతో రెచ్చిపోయి రొమాన్స్ చేయడంతో అనుపమ పరమేశ్వరన్ ఒక్కసారిగా ట్రెండింగ్‌లో వచ్చింది.

గతంలో ఎన్నడు లేనంత హాట్ కనిపించి అభిమానులకు షాకిచ్చింది. టిల్లు స్క్వేర్‌లో ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసింది. సిద్దు జోన్నలగడ్డతో లిప్ లాక్‌లతో అమ్మడు రెచ్చిపోయింది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసిన కూడా అనుపమ రొమాన్స్ గురించే విపరీతమైన చర్చ సాగుతోంది. ప్రేమమ్ మూవీతో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'అఆ' సినిమాతో అనుపమ తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా మారింది.
ఇక సోషల్ మీడియాలో కూడా అమ్మడు ఫాలోయింగ్ చూస్తే మతిపోతోంది. అనుపమ అంటే యూత్ పడిచచ్చి పోతారంతే. మిలియన్ల సంఖ్యలో అమ్మడను ఫాలో అవుతున్నారంటే అనుపమ రేంజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో నటించే అవకాశం వచ్చిన కూడా అనుపమ రిజెక్ట్ చేసిందట. వకీల్ సాబ్ సినిమాలో అనన్య నాగళ్ళ పాత్ర కోసం ముందుగా అనుపమ పరమేశ్వరన్‌నే ఎంపిక చేసుకున్నారట. అయితే క్యారెక్టర్ చిన్నది కావడంతో, పైగా పెద్ద ప్రాధాన్యత ఉన్న పాత్ర కాకపోవడంతో వకీల్ సాబ్ సినిమాను అనుపమ రిజెక్ట్ చేసిందట. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉన్న రెస్పెక్ట్ ఉన్నా కూడా అనుపమ ఈ క్యారెక్టర్ ను రిజెక్ట్ చేసిందట. అప్పట్లో ఈ న్యూస్ బాగా హాట్ టాపిక్ అయింది.












Click it and Unblock the Notifications