లైవ్‌లో సూసైడ్ చేసుకున్న బిగ్ బాస్ హీరో..!

ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్- 17 ఫేమ్ అనురాగ్ దోబాల్(UK07 RIDER) సంచలన నిర్ణయం తీసుకున్నారు. లైవ్ లోనే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. ఫ్యామిలీ కలహాలతో మనస్తాపానికి గురైనట్లు ఇన్ స్టా లైవ్ లో పేర్కొన్న ఆయన తన ఫాలోవర్లతో మాట్లాడుతూనే కారును వేగంగా 150kmph వేగంతో డివైడర్ ను ఢీ కొట్టారు. దీల్లీ- మీరట్ ఎక్స్ ప్రెస్ వే పై జరిగిన ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు చూసి ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

బిగ్ బాస్ కంటెస్టెంట్, ప్రముఖ యూట్యుబర్ అనురాగ్ దోభాల్ ఇన్‌ స్టాగ్రామ్ లైవ్‌ లో ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. కారును అతివేగంగా నడుపుకుంటూ వెళ్లి వేగంగా డివైడర్ ను ఢీ కొట్టారు. దాంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అనురాగ్ దోభాల్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

అయితే షాకింగ్ విషయం ఏంటంటే..? తన తల్లి ప్రేమ కోసం పరితపిస్తూ.. కన్నీళ్లు పెట్టుకుంటూ 150 కిలోమీటర్ల వేగంతో కారును డివైడర్‌కు ఢీకొట్టి ఆత్మహత్యాయత్నం చేశారు అనురాగ్ దోభాల్.. ఈమేరకు 'ఇదే నా చివరి ప్రయాణం' అంటూ లైవ్ లో తన ఫాలోవర్లకు గుడ్ బై చెప్పి మరి ఈ దారుణానికి పాల్పడ్డారు. అయితే ఆయన ఈ షాకింగ్ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం.. తాను వేరే కులానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకోవడమేనట. దాంతో అతడ్ని కుటుంబం పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే అతడు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నట్లు సమాచారం.

AnuragDobal Suicide Bid Live Bigg Boss Fame Anurag Dobal Crashes Car at 150 km h Rushed to ICU

ముందే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న దోభాల్.. ఈ మేరకు మార్చి 7న రాత్రి ఘజియాబాద్‌ లో దిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌ వేపై అనురాగ్ తన కారులో వెళ్తూ లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ చేశారు. ఆ సమయంలో సుమారు 80 వేల మందికి పైగా లైవ్ లో ఉన్నారు. ఈ మేరకు అనురాగ్ కన్నీళ్లతో.. వచ్చే జన్మలోనైనా నాకు ప్రేమను ఇవ్వు మమ్మీ.. నాకు ప్రేమ అవసరం" అంటూ ఎమోషనల్ అయి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కారును స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+