అవును..అతను నన్ను ప్రేమించాడు - అనుష్క
టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోయిన్ల.. జాబితాలో అనుష్క ముందు వరుసలో ఉంటారనే చెప్పాలి. నాగార్జున నటించిన సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన అనుష్క అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగులో హీరోలతో సమానంగా అనుష్కకు మార్కెట్ ఉందంటే అతిశేయోక్తి కాదు.
అయితే గత కొంతకాలంగా అనుష్క సినిమాలు చేయడం తగ్గించేసిందనే చెప్పాలి. జీరోసైజ్ సినిమాతో లావు పెరిగిన అనుష్క తరువాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసింది. దాదాపు 100 కేజీలకు పైగా బరువు పెరిగి షాకిచ్చింది. ఆ వెంటనే 'నిశ్శబ్దం' సినిమా కోసం బరువు తగ్గి మాములు స్థితిలోకి వచ్చింది. గతేడాది యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. రీ ఎంట్రీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది అమ్మడు.అనుష్క పరిశ్రమకు వచ్చి దాదాపు 19 ఏళ్ళు అవుతుంది. కథ నచ్చితే తప్పిస్తే అనుష్క సినిమా ఒప్పుకోదనే విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే అనుష్క పెళ్లికి సంబంధించి అనేక వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. హీరో ప్రభాస్, అనుష్క ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ అనేక కథనాలు వెలువడ్డాయి.
అయితే తాము కేవలం స్నేహితులమే అని , తమ మధ్య ఎలాంటి బంధం లేదని వీరిద్దరు క్లారిటీ ఇచ్చారు. అయితే అనుష్క ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ఫస్ట్ లవ్ గురించి చెప్పుకొచ్చారు. తాను ఆరో తరగతి చదువుతున్న సమయంలో తన క్లాస్ మేట్ ఒకరు ప్రపోజ్ చేసినట్టు తెలిపింది. అయితే దానికి తాను ఏమని రిప్లై ఇచ్చారనేది మాత్రం అనుష్క వెల్లడించలేదు. ఇలా తనకొచ్చిన ఫస్ట్ ప్రపోజల్ గురించి బయటపెట్టారు అనుష్క.
-
తెలుగు సినీ పరిశ్రమలో శత్రుత్వాలు వీరి మధ్యేనా? -
నో గ్యాప్- షూటింగ్ రెజ్యూమ్ పెళ్లి తర్వాత తొలిసారి కెమెరా ముందుకు విజయ్, రష్మిక -
నాగ చైతన్య నెవర్ బిఫోర్ అవతార్.. కేరీర్ బిగ్టెస్ట్ హిట్ ప్రామిస్ -
14 ఏళ్లుగా కింగ్ నాగార్జున రికార్డును బీట్ చేయలేకపోతున్న హీరోలు -
వాయిదా పడ్డ రూ.1,000 కోట్ల సినిమా -
మనల్ని ఎవడ్రా ఆపేది.. ముందుగానే వచ్చేస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్" !! -
వాళ్లు అందరూ సర్వనాశనం అయిపోతారు - చలాకీ చంటి -
అనసూయకు అవమానం..? వీడియో -
బిగ్ షాక్ ఇచ్చిన మరో స్టార్ సింగర్.. ఇకపై స్టాప్ ! -
క్లిక్స్ కోసం ఇంత నీచమా?: సోదరుడి కోసం రంగంలోకి స్టార్ హీరోయిన్! -
"అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే ఏమవుతుంది..?" -
టాలీవుడ్‌లో 8 వారాల ఓటీటీ రూల్?












Click it and Unblock the Notifications