పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. "ఓజీ" ప్రీమియర్స్ షురూ.. టికెట్ రేట్లు పెంపు.. ఎంతంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ "ఓజీ" సినిమాపై అంచనాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ గ్యాంగ్‌ స్టర్‌ డ్రామాలో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యణ్‌ టైటిల్‌ రోల్‌ లో కనువిందు చేయనున్నారు. ఓజాస్ గంభీరా గా ఆయన మెప్పించనున్నారు. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా ఓజీ మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రచారాన్ని వేగవంతం చేస్తోంది మూవీ టీమ్. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్​, పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో సాంగ్ ఒక్కో డైమండ్ అన్నట్లుగా ఉంది. పాటలన్నీ చాల కొత్తగా అనిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన​ 'గన్స్‌ అండ్‌ రోజెస్‌' సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. దీంతో సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. హిట్ టాక్ వస్తే చాలు కళ్లు చెదిరే వసూల్లు రాబట్టేందుకు సిద్దమైంది మూవీ.

అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓజీ సినిమా టికెట్ల రేట్లను పెంచేందుకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన జీవో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. ఈ జీవో ప్రకారం మొదటి 10 రోజులకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఓకే చెప్పింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు టికెట్ పై రూ. 125 అదనంగా జీఎస్టీ కలిపి.. అలాగే మల్టీఫ్లెక్స్ అయితే రూ. 150 అదనంగా జీఎస్టీ కలిపి అని జీవోలో స్పష్టం చేసింది. పెంచిన ధరల ప్రకారం.. సింగిల్ స్క్రీన్ అయితే టికెట్ ధర రూ. 272 అలాగే మల్టీప్లెక్స్ అయితే రూ.327 గా ఉంది. ఈ టికెట్ ధరలు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబరు 4 వరకు అమల్లో ఉంటాయని జీవోలో స్పష్టంగా పేర్కొంది.

అలాగే మెగా ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. ఓజీ సినిమాకు ప్రీమియర్స్ వేయాలని నిర్ణయించారు. అర్ధరాత్రి 1 గంటలకు ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి. ప్రీమియర్ షోకు టికెట్ ధర రూ. 1000 గా నిర్ణయించారు. సెప్టెంబర్ 25 తెల్లవారుజామున 1 లేదా 4 గంటల నుంచి స్క్రీనింగ్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందినట్లు తెలుస్తోంది.

AP Government Hikes Ticket Prices for Pawan Kalyan s OG Ahead of Premieres

ఇక తాజాగా ఓజీ మూవీ మరో రికార్డు సృష్టించింది. అమెరికాలో ప్రీమియర్‌ షోల కోసం ఇప్పటికే 50,000 టికెట్లు అడ్వాన్స్‌ బుకింగ్‌ లో అమ్ముడుపోయాయి. రిలీజ్‌కు వారం రోజుల ముందే ఈ ఫీట్‌ సాధించడం విశేషం.ఇక నార్త్‌ అమెరికాలో వేగంగా 50 వేల టికెట్లు సేల్‌ అయిన తెలుగు సినిమాగా ఓజీ నిలిచింది. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 21 న గ్రాండ్ గా నిర్వహించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+