సినీ ఇండస్ట్రీ పెద్దలకు గట్టి షాక్ ఇచ్చిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పెద్దలకు గట్టి షాక్ ఇచ్చారు. భారతీయుడు2 సినిమాకు ఏపీలో ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. వారిలో ఒకరు దగ్గుబాటి సురేష్ బాబు. ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి కోరగా తిరస్కరణకు గురైంది. దీంతో సినీ పరిశ్రమకు చెందిన పెద్దలంతా ఆలోచనలో పడ్డారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నేత, 100 సినిమాలను తీసిన నిర్మాత అయిన దగ్గుబాటి రామానాయుడి కుమారుడే సురేష్ అయినప్పటికీ ధరలు పెంచుకోవడానికి అనుమతివ్వలేదు.
జైలులో ఉన్నప్పుడు మద్దతిచ్చింది ముగ్గురే
చంద్రబాబునాయుడును అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం పలు కేసులు బనాయించి రాజమండ్రి జైలులో ఉంచింది. ఆ సమయంలో కె.రాఘవేంద్రరావు, సి.అశ్వనీదత్, కె.ఎస్.రామారావు మినహా ఎవరూ స్పందించలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబునాయుడు, లోకేష్ తమకు ఎవరు మద్దతుగ నిలబడ్డారు? ఎవరు తమ మనుషులు?, ఎవరు తమ మనుషులు కాదు అనే విషయంలో ఒక స్పష్టతకు వచ్చారు. చంద్రబాబునాయుడు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అన్ని సందర్భాల్లో సినీ పరిశ్రమకు పూర్తి మద్దతునిచ్చారు.

ఏ హీరోకు అనుమతివ్వరు
అయితే ఈసారి మాత్రం అటువంటి మద్దతివ్వడంలేదని స్పష్టం చేసినట్లైంది. అంటే భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోల సినిమాలకు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి రాదని అర్థమవుతోంది. ఆ విషయాన్ని ప్రభుత్వం పరోక్షంగా తెలిపింది. వీరెవరూ చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో కనీసం ట్వీట్ కూడా చేయలేదు. ప్రస్తుతం కల్కికి అనుమతిచ్చారు అంటే అశ్వనీదత్ నిర్మాతగా ఉన్నారు కాబట్టి టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి వచ్చింది. భవిష్యత్తులో ప్రభాస్ తో సినిమా తీసే నిర్మాతలకైనా టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతివ్వరు.
రెమ్యునరేషన్ తగ్గించుకోబోతున్న పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ మద్దతుగా నిలబడ్డాడు కాబట్టి ఆయన మాట్లాడితే రామ్ చరణ్ సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునే అనుమతివ్వొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కల్యాణ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి తన సినిమాలకు టికెట్ ధరలను పెంచరు. ఆ భారం నిర్మాతలపై పడకుండా ఆయనే పారితోషికాన్ని కూడా తగ్గించుకోబోతున్నారు. ఏదేమైనప్పటికీ చంద్రబాబు అధికారంలోకి వస్తే తమ ఇష్టమొచ్చినట్లు టికెట్ ధరలు పెంచుకొని ప్రేక్షకుల నుంచి అన్యాయంగా డబ్బులు పిండుకోవాలనుకుంటున్న నిర్మాత, దర్శకులు, హీరోలకు చంద్రబాబు ప్రభుత్వం చెక్ పెడుతోంది.












Click it and Unblock the Notifications