చిరంజీవి సినిమా చూసి హోంమంత్రి పదవి నుంచి తప్పుకున్న నాయకుడు?
మెగాస్టార్ చిరంజీవి వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తూ దూసుకువెళుతున్న సమయంలో హఠాత్తుగా ఆయన్నుంచి వచ్చిన చిత్రం రుద్రవీణ. కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ గా విజయం సాధించకపోయినప్పటికీ జాతీయస్థాయిలో నాలుగు అవార్డులను సొంతం చేసుకుంది. ఇలాంటి సినిమా చేసినందుకు చిరంజీవిని, ఇలాంటి సినిమాను తీసినందుకు నాగబాబును అందరూ అభినందించారు. అభిమానులు మాత్రం ఇలాంటి సినిమాను జీర్ణించుకోలేకపోయారు.
గ్రామసభలో పాల్గొన్న పవన్ కల్యాణ్
ఈ సినిమాను ఆదర్శంగా తీసుకున్న ఓ రాజకీయ నాయకుడు హోం మంత్రి పదవి రేసు నుంచి తప్పుకున్నారు. ఆయనెవరో కాదు.. చిరంజీవి తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఏపీలో ఒకేసారి 13వేల గ్రామ పంచాయితీల్లో గ్రామ సభలను నిర్వహించిన సంగతి తెలిసిందే. గ్రామాల్లో ఉన్న సమస్యలపై ఒక తీర్మానం చేసి వాటిని పరిష్కరించుకునేందుకు వీటిని నిర్వహించారు. పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కల్యాణ్ వైఎస్సార్ కడప జిల్లాలోని ఓ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు.

అన్నాహజారే స్ఫూర్తితో తెరకెక్కించాం
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే తనను అందరూ ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు హోం మంత్రి పదవి కూడా తీసుకోమన్నారని పవన్ చెప్పారు. అయితే పంచాయితీరాజ్ శాఖ మీద తనకు మక్కువ ఎక్కువని, అన్నయ్య చిరంజీవి రుద్రవీణ సినిమాను అన్నాహజారే జీవితకథ స్ఫూర్తితో తెరకెక్కించారన్నారు. ఆ గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు అన్నా హజారే దేశం మొత్తం తమవైపు చూసేలా పోరాటం చేశారన్నారు. పంచాయితీ వ్యవస్థలకు సర్పంచులు అంత బలంగా ఉండాలన్నారు. అప్పుడే అవి అభివృద్ధి చెందుతాయని, గ్రామాలను బలోపేతం చేసే ఉద్దేశంతోనే తాను హోంమంత్రి పదవిని తీసుకోలేదన్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.












Click it and Unblock the Notifications