ఓటీటీలో దుమ్మ రేపుతోన్న అప్సర రాణి బోల్డ్ మూవీ.. ‘డార్క్ సీక్రెట్స్‘

ప్రస్తుత డిజిటల్ యుగంలో భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ఉన్న చిత్రాలకు ఓటీటీల్లో బ్రహ్మరథం పడుతున్నారు. ఒకప్పుడు థియేటర్లకే పరిమితమైన చిన్న చిత్రాలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సరికొత్త జీవం పోస్తున్నాయి. ఇదే కోవలో వచ్చిన వినూత్న తెలుగు ఆంథాలజీ చిత్రం 'డార్క్ సీక్రెట్స్' ఇప్పుడు డిజిటల్ వేదికపై అరుదైన రికార్డులను తిరగరాస్తోంది.

ఫౌజీ మూవీ నుంచి ప్రభాస్ డేంజరస్ లుక్ లీక్.. సోషల్ మీడియా షేక్..
ఫౌజీ మూవీ నుంచి ప్రభాస్ డేంజరస్ లుక్ లీక్.. సోషల్ మీడియా షేక్..

అమెజాన్ ప్రైమ్ లో
ప్రముఖ అంతర్జాతీయ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'టాప్ 10 పర్చేసెస్ ఇన్ ఇండియా' జాబితాలో ఈ చిత్రం అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని ట్రెండింగ్‌లో నిలిచింది. జాతీయ స్థాయిలో హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, ఇంగ్లీష్ చిత్రాల నుంచి తీవ్రమైన పోటీ నెలకొన్నప్పటికీ, వాటన్నింటినీ వెనక్కినెట్టి ఒక తెలుగు ఆంథాలజీ ప్రాజెక్ట్ నంబర్ వన్ స్థానంలో నిలవడం సినీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. రూ.99 చెల్లించి ఈ సినిమాను చూడొచ్చు.

Apsara Rani bold movie Dark Secrets is creating a buzz on OTT tops Amazon Prime Video Full Details

మానవ అంతరంగాల నిషేధిత కోణాలు
"ప్రతి మనిషి అంతరంగంలో బయటకు చెప్పలేని ఒక రహస్యం ఉంటుంది.. ఒకవేళ ఆ గుట్టు రట్టయితే జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయి?" అనే ఆసక్తికరమైన అంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. సామాజిక ఒత్తిళ్లు, ఒంటరితనం, నిషేధిత కోరికలు, నైతిక హద్దుల మధ్య నలిగిపోయే మనుషుల మానసిక సంఘర్షణను దర్శకుడు అవినాష్ కొకటి ఎంతో వాస్తవికంగా తెరకెక్కించారు. విభిన్నమైన కథలను ఒకే భావోద్వేగ సూత్రంతో అనుసంధానించడంలో ఆయన చూపిన నైపుణ్యం వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Romanchakam: చిన్న సినిమాకు అద్దిరిపోయే కలెక్షన్స్..
Romanchakam: చిన్న సినిమాకు అద్దిరిపోయే కలెక్షన్స్..

అప్సర రాణి, జయశ్రీ
'టచ్‌వుడ్ టేల్స్' పతాకంపై అరుణ్ కుమార్ కొప్పుల, కృష్ణ నాగరం నిర్మించిన ఈ చిత్రంలో అప్సర రాణి, జయశ్రీ, అజిత్ రాధారం, మోహిత్ రెహ్మానియాక్, నైనిక అనసూయ కీలక పాత్రల్లో అద్భుత నటనను కనబరిచారు. వాణిజ్య హంగుల కంటే కథలోని భావోద్వేగాలకే ప్రాధాన్యమిచ్చి నిర్మించిన ఈ చిత్రం, సరైన కంటెంట్ ఉంటే డిజిటల్ ప్రేక్షకులు ఎంతటి ఘనవిజయాన్ని అందిస్తారో మరోసారి నిరూపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+