అడ్డంగా బుక్ అయిన "అషు రెడ్డి".. ఆడియో కాల్ లీక్‌లో వార్నింగ్ !!
సోషల్ మీడియా సెన్సేషన్, తెలుగు బ్యూటీ "అషూ రెడ్డి" వివాదం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లి పేరుతో మోసం చేసి కోట్ల రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS)లో ఆమెపై కేసు నమోదైంది. షేక్‌పేట్‌కు చెందిన వ్యాపారవేత్త సత్యనారాయణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. తన కొడుకును పెళ్లి పేరుతో నమ్మించి అషురెడ్డి, ఆమె కుటుంబ సభ్యులు కలిసి సుమారు రూ.9.35 కోట్ల వరకు నగదు, ఆస్తులు తీసుకున్నారని ఆరోపించారు. పలుమార్లు నగదు రూపంలో డబ్బులు తీసుకున్నారని.. లగ్జరీ కార్లు కొనుగోలు చేయించుకున్నారని, ఫ్లాట్లు, బంగారం కూడా తమ డబ్బులతోనే తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు.
కానీ వివాహంపై స్పష్టత ఇవ్వకుండా ఎప్పటికప్పుడు కారణాలు చెబుతూ వాయిదా వేస్తున్నారని సత్యనారాయణ ఆరోపించారు. పెళ్లి ప్రస్తావన వస్తే తప్పించుకుంటున్నారని, చివరకు మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించామని తెలిపారు. ఈ ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలపై వివరాలు సేకరిస్తూ, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు, ఆస్తుల కొనుగోళ్లపై విచారణ కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే అషు రెడ్డి ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఇన్ డైరెక్ట్ గా ఈ ఘటనపై స్పందించారు. తనపై వస్తున్న వార్తలు అబద్ధమని.. తన అనుమతి లేకుండా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానని స్టోరీలో రాసుకొచ్చారు. తాజాగా ఈ కేసులో అషు రెడ్డికి సంబంధించి ఆడియోలు రికార్డింగ్స్ లీక్ అయ్యాయి. అందులో ఎన్నారై ధర్మేంద్రను బెదిరిస్తూ అషురెడ్డి మాట్లాడినట్టు సంభాషణలు బయటకు వచ్చాయి. దీంతో ఈ ఇష్యూ మరింత చర్చనీయాంశంగా మారింది.
ఆడియో కాల్ కలకలం..
రికార్డింగ్స్ లో అషు మాట్లాడుతూ.. నేను తీసుకున్న డబ్బుల్లో కోటిన్నర రూపాయలు మాత్రమే ఇప్పుడు ఇస్తానని.. మిగతా డబ్బులు సెటిల్ అయిన తర్వాత ఇస్తానని చెప్పుకొచ్చింది. తాను చెప్పినట్టు డబ్బులు తీసుకుంటే మంచిదని లేకుంటే వేధింపుల కేసు పెడతానని తెలిపింది. తన పర్మిషన్ లేకుండా ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నావ్ అని కేసు పెడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. తాను చెప్పినట్టు వినకుండా మధ్యలో పెద్ద మనుషుల మధ్య ఒప్పందం చేసుకువాలంటే.. ప్రవీణ అక్క, వేణు స్వామిలతో కలిసి రాజీ చేసుకుందామని వెల్లడించింది. అసలు నాకు నీ ముఖం కూడా చూడడానికి ఇష్టం లేదని.. అసలు ఈ మ్యాటర్ గురించి మాట్లాడడం ఇష్టం లేదని చెప్పింది. ఏదైనా ఉంటె సెటిల్ చేసుకుందాం అని బెదిరించినట్టు సోషల్ మీడియాలో కాల్ లీక్ వైరల్ గా మారింది.

ఇక అషు రెడ్డి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా టిక్‌టాక్ వీడియోల ద్వారా విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకోవడమే కాకుండా.. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి ఎంట్రీ కూడా ఇచ్చింది. హౌస్‌లో ఎక్కువ కాలం కొనసాగలేకపోయినా కానీ.. షో తర్వాత కూడా ఆమె ఏ మాత్రం తగ్గలేదు. ఆ తర్వాత వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ఆమెకు విపరీతమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. అలా యాంకర్‌గా, నటిగా బిజీగా ఉన్న సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫోటోషూట్స్, వీడియోలతో అభిమానులను అలరిస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.












Click it and Unblock the Notifications